ఏటీఎంలో నో క్యాష్‌ : ఎస్‌బీఐకి ఫైన్‌

SBI fined Rs 2,500 after its ATM failed to dispense cash - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకుల సేవింగ్‌ ఖాతాల్లో మినిమం బాలెన్స్‌ లేకపోతే కస్టమర్లను ఛార్జీలతో బాదేయడం మనకు తెలిసిందే. అయితే ఏటీఎంలో సరిపడినంత నగదు ఉంచడంలో ఫెయిలైన అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐకి భలే షాక్‌ తగిలింది. కస్టమర్‌ ఫిర్యాదును విచారించి వినియోగదారుల ఫోరం ఎస్‌బీఐకు జరిమానా విధించింది. అంతేకాదు ఇంటర్నెట్‌ ఫెయిల్యూర్‌, ఎస్‌బీఐ కస‍్టమర్‌ కాదు లాంటి కుంటిసాకులతో తప్పించుకోజూసిన బ్యాంకునకు మొట్టికాయలు కూడా వేసింది. 

వివరాల్లోకి వెడితే రాయపూర్‌కు చెందిన వినియోగదారుడు ఏటీఎంలో నగదు విత్‌ డ్రా కోసం వెళ్లినపుడు నో క్యాష్‌ అవైలబుల్‌ మెసేజ్‌ వెక్కింరిచింది. మూడుస్లారు ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. 2017 ఏడాదిలో మే, జూన్‌ నెలలో ఒకసారి, మరోసారి ఇలా మూడుసార్లు  ఏటీఏంలో నగదు తీసుకోలేకపోయాననీ, ఈ వ్యవహారంలో  తనకు న్యాయం చేయాల్సిందిగా కన్జ్యూమర్‌ ఫోరంలో ఫిర్యాదు చేశారు.
 
దీన్ని విచారించిన కోర్టు అన్నిబ్యాంకులు ఏటీఏం సేవలపై ఏడాదికి ముందే ఫీజు నుకస్టమర్ల వద్దనుంచి వసూలు చేస్తున్నపుడు..ఏటీఏంలో నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులకు ఉందని వినియోగదారుల ఫోరం తన తీర్పులో పేర్కొంది. మూడు సందర్భాల్లో ఏటీఎంలో క్యాష్‌ లభించపోవడంపై ప్రశ్నించింది. అయితే కేవలం ఇంటర్‌నెట్‌ వైఫల్యమని, దీనికి సర్వీసు ప్రొవైడర్‌ బాధ్యత వహించాలన్న ఎస్‌బీఐ వాదనను కూడా తోసి పుచ్చింది. అలాగే మినిమం బ్యాలెన్స్‌  మెయింటైన్‌ చేయని యూజర్ల నుంచి  ఏడాదిలో ముందే ఛార్జి వసూలు చేస్తున్నపుడు ఏటీఎంలలో నగదు లేకుండా ఏలా చేస్తారని ప్రశ్నించింది.  రూ.2500 ఫైన్‌ చెల్లించాలని ఆదేశించింది.

కాగా ఎస్‌బీఐ నెలకు రూ. వెయ్యి-మూడువేల వరకు కనీస నిల్వను  ఉంచని పొదుపు ఖాతాల ఖాతాదారుల నుంచి జీఎస్‌టీ తోపాటు 5-15శాతం జరిమానా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో 2017-18 సంవత్సరంలోని ఎనిమిది నెలల కాలంలో 41కోట్ల మంది సేవింగ్స్‌ ఖాతాదారులను కలిగి ఉన్న ఎస్‌బీఐ దాదాపు రూ.1772 కోట్లను  జరిమానా రూపంలో వసూలు  చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top