ఇసుక లోడ్‌కెళ్లొచ్చే లోపు.. భార్య రష్మి సహా రూ.2 లక్షల నగదు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఇసుక లోడ్‌కెళ్లొచ్చే లోపు.. భార్య రష్మి సహా రూ.2 లక్షల నగదు అదృశ్యం

Jun 18 2023 12:42 PM | Updated on Jun 18 2023 12:54 PM

- - Sakshi

భార్య రష్మి అదృశ్యమైంది. ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ రావడంతోపాటు ఇంట్లోని రూ.2 లక్షల నగదు కనిపించడం లేదని రాజేశ్వర్‌ పేర్కొన్నాడు.

హైదరాబాద్: భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం భానూర్‌–బీడీఎల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్‌ రెడ్డి కథనం ప్రకారం మెదక్‌కు చెందిన రాజేశ్వర్‌ పటాన్‌చెరు మండలం పాశమైలారం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. గత నెల 23న ఒడిశా రాష్ట్రానికి చెందిన రష్మితో వివాహమైంది.

శనివారం రాజేశ్వర్‌ ఇసుక లోడ్‌ ఖాళీ చేయించడానికి వెళ్లి తిరిగి ఉదయం 9.30 గంటలకు తన ఇంటికి రాగా, భార్య రష్మి అదృశ్యమైంది. ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ రావడంతోపాటు ఇంట్లోని రూ.2 లక్షల నగదు కనిపించడం లేదని రాజేశ్వర్‌ పేర్కొన్నాడు. ఆమె ఆచూకీ కోసం తెలిసిన, బంధువులను విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో రాజేశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement