
రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం... 5 ఏళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం నకిలీ నోట్ల సంఖ్య పెరిగింది. 2020–21లో 2.08 లక్షల నకిలీ నోట్లను గుర్తిస్తే... 2024–25లో వాటి సంఖ్య 2.17 లక్షలకు పెరిగింది. ముఖ్యంగా రూ.500 (ఎమ్‌జీ కొత్త సిరీస్) అప్పట్లో 39 వేలకుపైగా ఉంటే... 5 ఏళ్ల తరవాత 1.17 లక్షలకు పైగా పెరగడం గమనార్హం.
మరోపక్క డిజిటల్ లావాదేవీలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నా... దేశంలో చలామణీలో ఉన్న నగదు ఏటా పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2024లో ఇది దాదాపు రెండు రెట్లు పెరగడం విశేషం. 2018లో రూ.18.29 లక్షల కోట్లు చలామణీలో ఉండగా, 2024 నాటికి ఇది రూ.35.11 లక్షల కోట్లకు చేరింది
2018 నాటికి భారతదేశంలో చలామణీలో ఉన్న నగదు మొత్తం రూ.18.29 లక్షల కోట్లుగా నమోదైంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇది స్థిరంగా పెరుగుతూ వచ్చింది. 2019లో రూ.21.36 లక్షల కోట్లకు, 2020లో రూ.24.47 లక్షల కోట్లకు చేరింది. 2021 నాటికి ఈ మొత్తం రూ.28.53 లక్షల కోట్లకు పెరిగింది. 2022లో ఇది రూ.31.33 లక్షల కోట్లకు, 2023లో రూ.33.78 లక్షల కోట్లకు పెరిగింది. చివరకు 2024 నాటికి చలామణీలో ఉన్న నగదు రూ.35.11 లక్షల కోట్లకు చేరింది. అంటే 2018తో పోలిస్తే 2024లో దాదాపు రెట్టింపు వృద్ధి నమోదైంది.
