ముంబై: ప్రస్తుతం రూ. 5,817 కోట్ల విలువ చేసే రూ. 2,000 కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డేటాలో వెల్లడైంది. ఈ నోట్లను ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది. అప్పట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు ఉండగా.. 2025 అక్టోబర్ 31 నాటికి రూ. 5,817 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ శనివారం తెలిపింది. 2023 మే 19 నుంచి చూస్తే 98.37 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించినప్పటికీ రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతున్నాయి.


