కూతురిని అమ్మేసి.. ఆపై కట్టుకథ..

Mother Held For Selling Daughter For Money In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లి రెండేళ్ల కూతురిని 20వేలకు అమ్మేసింది. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలివి.. ఆ పాపను కొందరు బ్రోకర్లు ఓ ఎంపీటీసీ భర్తకు రూ. 80వేలకు అమ్మారు.

భర్త కొడతాడనే భయంతో ఓ కట్టుకథ చెప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి పాపను ఎత్తుకెళ్లారని ఆ మహిళ భర్తకు చెప్పి బోరున ఏడ్చింది. దీం అతను వెంటనే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top