క్రిస్మస్‌ రోజు ఉపాసన వేసుకున్న డ్రెస్‌ అ‍న్ని లక్షలా? | Sakshi
Sakshi News home page

Upasana: క్రిస్మస్‌ వేడుకల్లో ఉపాసన వేసుకున్న డ్రెస్‌ కాస్ట్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Published Thu, Dec 28 2023 12:10 PM

Upasana Gucci Dress For Christmas With Daughter Shocks You - Sakshi

మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్‌చరణ్‌ భార్యగానే కాకుండా స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంది ఉపాసన. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇటీవలె బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. ప్రతీ అకేషన్‌ను స్పెషల్‌గా జరుపుకుంటుంది.

రీసెంట్‌గా మెగా ఫ్యామిలి క్రిస్మస్‌ వేడుకల్లో ఉపాసన వేసుకున్న డ్రెస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించిన ఆ డ్రెస్‌ ధర లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం.ఈ క్రమంలో ఉపాసన వేసుకున్న డ్రెస్‌ గురించి నెట్టింట సెర్చ్‌ చేయగా, కళ్లు చెదిరే ధర చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.గూసీ బ్రాండ్‌కు చెందిన రెడ్‌ కలర్‌ స్కర్ట్‌లో తళుక్కున మెరిసింది ఉపాసన.

చూడటానికి సింపుల్‌గా కనిపించిన ఈ డ్రెస్‌ ధర అక్షరాలా రూ. 3,01,545. దీంతో అంత సాదాసీదాగా ఉన్న డ్రెస్‌కు అన్ని లక్షలు పెట్టి కొన్నారా? అయినా సెలబ్రిటీలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఏదేమైనా ఆ డ్రెస్‌లో ఉపాసన చాలా క్లాసీ లుక్‌లో కనిపిస్తున్నారంటూ పొగిడేస్తున్నారు. 
 

Advertisement
Advertisement