Megastar Family: మనవరాలితో మెగాస్టార్.. తొలిసారి వారసురాలితో వినాయకచవితి సెలబ్రేషన్స్!

Megastar Family Celebrates This VinayakaChavithi With Klin Kara  - Sakshi

మెగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది వినాయకచవితి మెగా ఫ్యామిలీకి మరింత స్పెషల్. ఎందుకంటే తొలిసారిగా మెగా వారసురాలితో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులకు బేబీ పుట్టింది. అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మినిచ్చింది. మెగా వారసురాలు అడుగుపెట్టిన సందర్భంగా ఫ్యాన్స్‌తో పాటు కుటుంబసభ్యులు సైతం ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు.

(ఇది చదవండి: వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!)

తన మనవరాలి పేరును మెగాస్టార్ దంపతులు రివీల్ చేశారు. కొణిదెల క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా క్లీంకారతో కలిసి ఈ ఏడాది వినాయకచవితిని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన మెగా ఫ్యాన్స్ సైతం తాము అభిమానించే ఫ్యామిలీకి వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

(ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్)

రామ్ చరణ్‌ ఇన్‌స్టాలో రాస్తూ.. 'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top