ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్ | Sakshi
Sakshi News home page

Upcoming OTT Movies Telugu: ఓటీటీల్లో 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్!

Published Sun, Sep 17 2023 11:16 PM

Upcoming OTT Release Movies Telugu September 3rd Week - Sakshi

ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. అయితే ఈ సోమవారం వినాయక చవితి. కాబట్టి అందరూ భక్తి మోడ్ పాటిస్తూ ఉంటారు. మరోవైపు కాస్త విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి కుదిరితే ఏదైనా కొత్త సినిమా చూద్దామని అనుకుంటూ ఉంటారు. అలాంటి మూవీ లవర్స్ కోసమా అన్నట్లు ఈ వారం (సెప్టెంబరు 18 నుంచి 24 వరకు) దాదాపు 20 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 14వరోజు హైలైట్స్.. వెళ్తూ వెళ్తూ షకీలా ఏడిపించేసింది!)

గతవారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నంబర్ తగ్గింది. అయితే పలు స్ట్రెయిట్ మూవీస్, వెబ్ సిరీసులు కొన్ని ఆసక్తి కలిగిస్తున్నాయి. 'అతిథి' వెబ్ సిరీస్‌తోపాటు జానే జాన్, కింగ్ ఆఫ్ కొత్త, ఫాస్ట్ ఎక్స్ సినిమాలు.. కాస్త చెప్పుకోదగ్గ చిత్రాలని చెప్పొచ్చు. వీటితో పాటు మెగ్ 2 సినిమా కూడా కుదిరితే ప్రయత్నించొచ్చు. సరే అదంతా పక్కనబెడితే ఈ వారం ఏ సినిమాలు ఏ ఓటీటీల్లో రాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (సెప్టెంబరు 18 -24 మధ్య)

నెట్‌ఫ్లిక్స్

 • ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19
 • లవ్ ఎగైన్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 20
 • జానే జాన్ (హిందీ చిత్రం) - సెప్టెంబరు 21
 • కెంగన్ అసుర సీజన్ 2 (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 21
 • సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) - సెప్టెంబరు 21
 • సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 21
 • హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 22
 • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 22
 • సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 22
 • స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 22

అమెజాన్ ప్రైమ్

 • కసండ్రో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 22
 • ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 22

హాట్‌స్టార్

 • అతిథి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 19
 • దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 20
 • కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 22
 • నో వన్ విల్ సేవ్ యూ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 22
 • ద కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 23

జియో సినిమా

 • ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18

బుక్ మై షో

 • మెగ్ 2: ద ట్రెంచ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18

ఆపిల్ ప్లస్ టీవీ

 • స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 22

(ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?)

Advertisement
 
Advertisement
 
Advertisement