అత్తమ్మపై మెగా కోడలు ప్రశంసలు.. ఎందుకంటే? | Upasana Konidela Tweet On Womens Day About Her Mother In Law | Sakshi
Sakshi News home page

Upasana Konidela: అరవై ఏళ్ల వయసులో అత్తమ్మ అరంగేట్రం.. ఉపాసన ట్వీట్ వైరల్!

Mar 8 2024 3:13 PM | Updated on Mar 8 2024 3:34 PM

Upasana Konidela Tweet On Womens Day About Her Mother In Law - Sakshi

మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సంబంధం లేనప్పటికీ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రి  ద్వారా మహిళల గతేడాది ఈ జంటకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల  ఓ ఇంటర్వూలోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే రెండో బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ అంతర్జాతీయ మహిళ దినోత్సవం కావడంతో ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం. 

తాజాగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన కొణిదెల ట్వీట్ చేసింది. అత్తమ్మ, చిరంజీవి భార్య సురేఖపై ప్రశంసలు కురిపించింది. ఈ మహిళ దినోత్సవం రోజున 60 ఏళ్లలో మా అత్తమ్మ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. మనదేశంలో చాలామంది అ‍త్తమ్మలు, అమ్మలు బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఇష్టమైన వృత్తిలో సాధించిన విజయాలను ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఉపాసన పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా..ఇటీవల ఉపాసన నాలెడ్జి సిటీలోని టి–హబ్‌లో ట్రంఫ్‌ ఆఫ్‌ టాలెంట్‌ హౌజ్‌ ఆఫ్‌ మేకప్‌ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి.. ఆమే నాకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రస్తుత కాలంలో ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement