
సీరియల్ నటి శోభాశెట్టి విరామం ప్రకటించింది. 'కార్తీకదీపం' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. బిగ్‌బాస్ 7వ సీజన్‌లో పాల్గొని ఫినాలే వరకు వచ్చింది. కానీ ఆ సీజన్ టైంలో చాలా నెగిటివిటీ మూటగట్టుకుంది. దీని నుంచి బయటకొచ్చిన తర్వాత గతేడాది కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొంది. కానీ అనారోగ్య కారణాలతో మధ్యలోనే బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి సైలెంట్‌గానే ఉన్న ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?)
కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు శోభాశెట్టి తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో శోభాకు ఏమైందా? అని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కాబోయే భర్తతో ఏమైనా వాగ్వాదం జరిగిందా? లేదా మరేదైనా కారణమా అని మాట్లాడుకుంటున్నారు.
బిగ్‌బాస్ షోలో పాల్గొన్న టైంలోనే తన ప్రియుడిని పరిచయం చేసింది. తనతో పాటు సీరియల్‌లో నటించిన యశ్వంత్ రెడ్డిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అందుకు తగ్గట్లే షో నుంచి బయటకొచ్చిన కొన్నాళ్లకు ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. తర్వాత మరికొన్నాళ్లకు కొత్తింట్లోనూ అడుగుపెట్టింది. ఈ రెండు జరిగి చాలా రోజులు అయిపోయాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించిందని అనుకుంటున్నారు. మరి శోభాశెట్టి చెబితే తప్పితే ఈ విషయంపై క్లారిటీ రాదేమో?
(ఇదీ చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్)