తీవ్ర దుఃఖంలో శోభన.. మాటలు రావడం లేదంటూ.. | Shobana Expressed Grief on Close Friends Passing | Sakshi
Sakshi News home page

Shobana: విషాదంలో శోభన.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి..

Jun 4 2025 6:07 PM | Updated on Jun 4 2025 6:51 PM

Shobana Expressed Grief on Close Friends Passing

సీనియర్‌ హీరోయిన్‌ శోభన (Shobana) చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోయింది. తనకు ఎంతో ఇష్టమైన మిత్రురాలు అనిత మీనన్‌ ఇక లేదన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. సోషల్‌ మీడియా వేదికగా మిత్రురాలి మృతికి సంతాపం ప్రకటించింది. నా ప్రియమైన స్నేహితురాలి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇంతకుమించి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. బాబూ అంకుల్‌, సూ ఆంటీ, సతీశ్‌ మీనన్‌, అవీషా, అనీషా.. మీ అందరికీ నా ప్రగాఢ సానుభూతి అంటూ స్నేహితురాలు అనితతో కలిసున్న చిన్ననాటి ఫోటోలను షేర్‌ చేసింది.

చిన్నప్పటి నుంచి క్లోజ్‌ ఫ్రెండ్స్‌
చెన్నైలోని మైలపోర్‌లో శోభన ఇంటి పక్కనే అనిత మీనన్‌ కుటుంబం నివాసముండేది. శోభన కంటే అనిత మూడేళ్లు చిన్నది. ఇరుగుపొరుగు కుటుంబాలు కావడంతో వీరిద్దరూ ఎప్పుడూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా కలిసుండేవారు. శోభన హీరోయిన్‌గా వెండితెరపై బిజీగా ఉన్నప్పటికీ అనితతో తన స్నేహాన్ని కొనసాగించింది. ఇకపోతే శోభన.. ఇటీవలే వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. తుడరుం సినిమాలో మోహన్‌లాల్‌ భార్యగా నటించింది. 1990లో వీరిద్దరి కాంబినేషన్‌లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. 

సినిమాలు
‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్‌ 18’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. మలయాళంలో మణిచిత్రతారు అనే సినిమాలో ద్విపాత్రాభినయంతో మెప్పించి ఉ‍త్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. మిత్ర్‌ - మై ఫ్రెండ్‌ అనే సినిమాకుగానూ మరోసారి జాతీయ పురస్కారం గెల్చుకుంది. నటిగానే కాకుండా క్లాసికల్‌ టీచర్‌గా సేవలందిస్తున్న శోభనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది.

 

 

చదవండి: ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement