మెగా కోడళ్ల నయా బిజినెస్‌! | Sakshi
Sakshi News home page

మెగా కోడళ్ల నయా బిజినెస్‌!

Published Sun, Feb 18 2024 3:10 PM

Upasana And Surekha Start Athamma Kitchen - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి పుట్టినరోజు నేడు.. ఈ సందర్భంగా చిరు తనదైన స్టైల్లొ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా తన అత్తగారికి ప్రత్యేకంగా విషెష్‌ చెప్పారు. ఈ క్రమంలో ఒక వీడియోను ఆమె షేర్ చేశారు.

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు.

చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల గారు సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు వారి కడుపులను నింపుతుంది.

ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా "అత్తమ్మ కిచెన్"ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు.

వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు, సంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన, సురేఖ కొణిదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రతీకగా "అత్తమ్మ కిచెన్" నిలుస్తుంది. సురేఖ కొణిదెల పుట్టినరోజున వారు ఈ వెంచర్‌కు ప్రారంభించారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు.

ప్రస్తుతం ఆ ప్రొడక్ట్స్‌ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో (athammaskitchen.com) అందుబాటులో ఉన్నాయి. ఉప్మా,పొంగల్‌,పులిహార,రసం వంటి ఉత్పత్తులు ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ. 1,099 ఉంది. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి వాటిని పొందవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయిని వారు తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం మెగాస్టార్‌ సతీమణి చేసిన రెసిపీని మీరు  ఆస్వాదించండి.

అత్తమ్మాస్‌ కిచెన్‌ గురించి ఏం చెప్పారంటే

సురేఖ కొణిదెల పుట్టినరోజున ప్రారంభించారు. ఉపాసన కొణిదెల నేతృత్వంలోని "అత్తమ్మ కిచెన్" ప్రొడక్ట్స్‌లో, కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెంచర్ వారి ప్రత్యేకమైన వంటకాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ప్రియమైన పేరుగా మారాలనే లక్ష్యంతో ఉంది.

ఈ ప్రొడక్ట్స్‌ కోసం దిగువ లింక్‌లను అనుసరించండి:

వెబ్‌సైట్: www.athammaskitchen.com

వాట్సప్:http://api.whatsapp.com/send?phone=919866589955&text=Hi

ట్విట్టర్:https://twitter.com/athammaskitchen

ఇన్ స్టాగ్రాం: https://www.instagram.com/athammaskitchen

ఫేస్ బుక్: https://www.facebook.com/people/Athammas-Kitchen

Advertisement
 
Advertisement
 
Advertisement