ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో సిరిమాను ఉత్సవం ఘనంగా వైభవంగా సాగిన ముగ్గురమ్మల జాతర
మంగళ వాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. కళాకారుల వేషధారణల నడుమ ఇప్పలపోలమ్మ, ఎర్రకంచె మ్మ అమ్మవార్లు సిరిమానోత్సవం మంగళవారం సంబరంగా సాగింది.
వేడుకగా సాగిన ఇప్పల పోలమ్మ
ఎర్ర కంచెమ్మల సిరిమానుల తిరువీధి
తరలివచ్చిన భక్తజనం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
సిరిమాను పూజారుల రూపంలో వీధిల్లోకి తరలివచ్చిన అమ్మవార్లను తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.
జనసంద్రంగా పార్వతీపురంఅంజలి రథంపై పేడి వేషధారుల నాట్యం అనంతరం సిరిమాను తిరువీధి ప్రారంభమైంది.


