బన్నీకి ఉపాసన,చరణ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. టచ్‌ చేశారంటూ అల్లు అర్జున్‌ | Ram Charan And Upasana Sent Surprise Gift For Allu Arjun - Sakshi
Sakshi News home page

Upasana And Ram Charan: బన్నీకి ఉపాసన స్పెషల్‌ గిఫ్ట్‌.. టచ్‌ చేశారంటూ అల్లు అర్జున్‌

Aug 26 2023 11:10 AM | Updated on Aug 26 2023 11:15 AM

Upasana And Ram Charan Sent Gift For Allu Arjun - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించిన వెంటనే టాలీవుడ్‌ స్టార్స్‌ అందరూ శుభాకాంక్షలు చెప్పారు. వారిలో ప్రథమంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అయితే 'నీకు ఈ అవార్డులు, విజయం వచ్చి తీరాల్సిందే బావా' అని ట్వీట్‌ చేశాడు. దీంతో  బన్నీ కూడా 'హృదయపూర్వకంగా(జెన్యూన్‌గా) శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్‌ బావా' అంటూ రిప్లై ఇచ్చాడు. ఆపై ఆర్‌ఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ రాజమౌళి 'పుష్ప.. తగ్గేదేలే' అంటూ సినిమా స్టైల్‌లో కంగ్రాట్స్‌ చెప్పాడు.

(ఇదీ చదవండి: జాతీయ అవార్డ్​ విజేతలకు దక్కే ప్రైజ్​మనీ ఎంతో తెలుసా?)

ఇలా చాలామంది సినీ సెలబ్రిటీలు చెబుతుండగా రామ్‌ చరణ్‌ మాత్రం ఒకరోజు ఆలస్యంగా విషెస్‌ చెప్పాడు. అందుకు బన్నీ కూడా ఒక్క ముక్కలో థ్యాంక్స్‌ అని రిప్లై ఇచ్చాడు. దీంతో వీరిద్దర మధ్య ఏమైంది అంటూ పలువురు ఫ్యాన్స్‌ కూడా నెట్టింట కామెంట్లు కూడా చేశారు.

తాజాగా అల్లు అర్జున్‌కు గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్, ఉపాసన దంపతులు స్పెషల్‌గా ఒక గిఫ్ట్‌గా  ఒక పూల బొకేను పంపారు. దానితో పాటు ఓ స్పెషల్ నోట్‌ను కూడా బన్నీ గురించి ఇలా రాసుకొచ్చారు. 'డియర్ బన్నీ.. కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.. ఇలాంటివి ఇంకా ఎన్నో నిన్ను వరిస్తాయి. అందుకు నీవు అర్హునివి కూడా..' అని ఉపాసన రాసుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్‌ కూడా కొంతమేరకు ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.

థాంక్యూ సో మచ్ అంటూనే.. టచ్ చేశారని బన్నీ కూడా తెలిపాడు. ఇదంతా తన ఇన్ స్టా స్టోరీలో అల్లు అర్జున్‌ షేర్ చేశాడు. ఈ ఘటనతో అయినా రామ్‌ చరణ్‌,బన్నీ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఈ విషయాన్ని గ్రహించాలని వారి ఫ్యాన్స్‌ కోరుతున్నారు. దీంతో ఇకనైనా ఈ రూమర్స్‌కు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement