
నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ దీపావళి తనకు డబుల్ సంతోషాన్ని తెచ్చిందని ఒక వీడియోను పోస్ట్ చేశారు. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెసింగ్స్ అంటూ పేర్కొనడంతో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. కుటుంబ సభ్యులు అందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించడంతో మెగా వారసుడు రాబోతున్నాడంటూ ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఉపాసన మొదటిసారి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వారి ఇంట్లో ఇలాగే ఒక వేడుకలా చేశారు. తాజాగా ఉపాసన షేర్ చేసిన వీడియోలో ఇరు కుటుంబ సభ్యులు అందరూ చేరి ఆమెకు కొత్త దుస్తులు అందించడం చూడొచ్చు. ఆపై ఆమెకు పూలు, పండ్లు, కానుకలు అందించిన పెద్దలు ఆశీర్వదించారు. మెగా కుటుంబంతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు అందరూ అక్కడ సందడిగా కనిపించారు.
మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఉపాసన ఈ శుభవార్త చెప్పగానే 'సింబా' వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)