రాజకీయాలపై కొణిదెల ఉపాసన కామెంట్స్‌ | Ram Charan Wife Upasana Comments On Thalapathy Vijay Political Entry, Deets Inside - Sakshi
Sakshi News home page

Upasana On Vijay Political Entry: అలాంటి లీడర్‌కే సపోర్ట్‌ చేయాలి

Published Thu, Feb 8 2024 1:12 PM

Upasana Comments On Vijay Political Entry - Sakshi

తమిళ రాజకీయాల్లోకి స్టార్‌ హీరో విజయ్‌ అడుగుపెట్టిన సమయం నుంచి చాలా మంది ప్రముఖులు ఇప్పటికే వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్‌ గురించి తాజాగా కొణిదెల ఉపాసన ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

తమిళనాడులో ఒక నటుడుగా విజయ్‌ ఎంతోమందిని అభిమానులుగా మార్చుకున్నారని ఉపాసన అన్నారు. గతంలో కూడా ఆయన మాదిరి చాలామంది చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు ముఖ్యమంత్రులుగా కూడా సేవలు చేశారని ఆమె తెలిపారు. ప్రస్తుతం విజయ్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చారంటే గొప్ప విషయమే అని అన్నారు.

సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకునే లీడ్‌ర్‌ ఎవరున్నా సపోర్ట్‌ చేయాలనేది తన అభిప్రాయమని.. అలాంటి వారికి సపోర్ట్‌ చేయకపోయినా పర్వాలేదు కానీ వెనక్కి మాత్రం లాగకూడదని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్‌లో విజయ్‌ మంచి రాజకీయనాయకుడు కాగలరని భావిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. కానీ తాను మాత్రం రాజకీయాల్లోకి ఎట్టిపరిస్థితిల్లో రానని ఉపాసన తేల్చి చెప్పారు.

ఉపాసన ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్‌లో ఉంటారు. తన కుటుంబంలో జరిగిన శుభకార్యాలకు సంబంధించిన పలు ఫోటోలను కూడా ఆమె షేర్‌ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు రామ్‌ చరణ్‌తో పాటు గేమ్‌ ఛేంజర్‌ సినిమా సెట్స్‌ నుంచి కూడా ఆమె పలు ఫోటోలు షేర్‌ చేసుకున్నారు.

Advertisement
Advertisement