ముంబయికి గ్లోబల్‌ స్టార్ దంపతులు.. ఎందుకంటే? | Ram Charan Papped At Hyderabad Airport With Wife Upasana Konidela | Sakshi
Sakshi News home page

Ram Charan: క్లీంకారతో ముంబయికి రామ్ చరణ్‌.. ఎందుకో తెలుసా?

Jul 11 2024 1:10 PM | Updated on Jul 11 2024 3:05 PM

Ram Charan Papped At Hyderabad Airport With Wife Upasana Konidela

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌ ముంబయికి బయలుదేరి వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ పెళ్లికి సతీసమేతంగా హాజరు కానున్నారు. తాజాగా ఆయన భార్య ఉపాసన, ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన గేమ్ ఛేంజర్‌ ఈ ఏడాది చివర్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్‌ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ నటించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement