
తెలుగు ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో బిగ్బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ సోనియా ఆకుల. ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులకే ఎలిమినేట్ అయి బయటికొచ్చేసింది. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. ఆ తర్వాతే కొన్ని రోజులకే డిసెంబర్లో యశ్‌వీర్ గ్రోనితో ఏడడుగులు వేసింది. నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ.. నెల రోజుల్లోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది.
ఇటీవల తిరుమలను సందర్శించిన సోనియా.. తాజాగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భం ధరించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ విషయాన్ని అందరికంటే భిన్నంగా రివీల్ చేసింది. ఓ ప్రాజెక్ట్ రూపంలో ఫైల్ పట్టుకుని మరి వచ్చి తన భర్త యశ్‌వీర్ గ్రోనికి ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ శుభవార్త విన్న యశ్‌వీర్ గ్రోని తన భార్యను హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అలా బిగ్‌బాస్ 8లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.