
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం రిలీజ్ కాలేదు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల కావొచ్చని టాక్ వినిపిస్తోంది.
ఈ సంగతి పక్కనపెడితే చిరంజీవి విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో మూవీ రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఓ సీన్ షూట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నీటిలో పడవపై మెగాస్టార్, నయనతార కూర్చుని ఉండగా.. పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట లీక్ కావడంతో హల్చల్ చేస్తోంది. కేరళలోని అలప్పుజలో చిరంజీవి, నయనతారలపై పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాను మెగా157 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు.
#Nayanthara & #Chiranjeevi from #Mega157. Shooting currently happening in Kerala #ChiruAnil pic.twitter.com/mmGgfUmYpE
— Nayan wings (@Nayan_Universal) July 18, 2025
#Nayanthara & #Chiranjeevi from #Mega157
Shooting currently happening in Kerala #ChiruAnil pic.twitter.com/9i068f1PI3— PM7 MEDIA (@PM7Media) July 18, 2025
#Nayanthara angel from #ChiruAnil shooting bts pic. #Mega157
Looks alike Kerala theme marriage or song. #Chiranjeevi @NayantharaU pic.twitter.com/STzb4HAkW2— Dreamer (@remaerdkihtraK) July 18, 2025