
యాంకర్, నటి అనసూయ (Anasuya) ఎక్కువగా సోషల్మీడియా ద్వారా తన అభిమానులతో టచ్లో ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకుంటుంది. అయితే, తాజాగా ఫ్యాన్స్తో ఏర్పాటు చేసిన ఒక మీట్లో ఆమె పాల్గొన్నారు. ఆమె సినీ, యాంకరింగ్ జీవితం గురించి ఆమె పంచుకుంది. ఈ క్రమంలో తన కుటుంబం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నేటి సమాజంలో జీవిస్తున్న అందరికీ ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటారని అనసూయ చెప్పింది. అయితే, జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాణంగా ఉంటుందని తెలిపింది. కానీ, ప్రస్తుతం తన లైఫ్ చాలా అందంగానే ఉందని చెప్పిన అనసూయ.. తనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుకుంటున్నానని చెప్పింది. ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెల్లగలనని ఆమె పేర్కొంది. తన టీమ్ వర్క్‌తో కారు, ఇల్లు వంటివి అన్నీ సాధించుకున్నానని చెప్పింది. అయితే, తన టీమ్లో అభిమానులు కూడా ఉన్నారని ఆ వేదిక మీద ఉన్న ఫ్యాన్స్ను ఉద్దేశించి చెప్పింది.
అయితే, తన పాత జీవితాన్ని గురించి కూడా అనసూయ ఇలా పంచుకుంది. ' కుటుంబ సభ్యుల మోసం వల్ల నాన్న చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాతే ఆయన తనకంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ రేస్ క్లబ్‌లో ఒకప్పుడు ట్రైనర్‌గా పని చేసేవారు. ఆ సమయంలో 12 గుర్రాలు నాన్న వద్ద ఉండేవి. అక్కడ జరిగే రేస్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. ఏ రోజు ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉండేది. ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరత్వం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, నాన్న అక్కడ అర్థం చేసుకోలేకపోయారు.
అయితే, మా ఇంట్లో ముగ్గురం అక్కాచెళ్లెల్లం కావడంతో అబ్బాయి పుట్టలేదన్న బాధ నాన్నలో ఉండేది. ఒక్క వారసుడు అయినా ఉండాలని కోరుకునేవారు. పోచంపల్లిలో వందల ఎకరాల భూములను పేదలకు దానం చేశారు. నాన్న నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. ఆయనంటే నాకు చాలా ప్రేమ' అని అనసూయ చెప్పింది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు 2021లో క్యాన్సర్ వల్ల మరణించారు. ఆయన చాలం కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. సోషల్ యాక్టివిటీస్‌లో ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు.