పూనకంతో ఊగిపోయిన చిట్టి తల్లి.. మెగాస్టార్ ఫిదా | Megastar Chiranjeevi Tweet Goes Viral Social Media | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: థియేటర్‌ను ఊపేసిన చిన్నారి.. మెగాస్టార్ ట్వీట్ వైరల్

Published Sun, Jan 15 2023 6:29 PM | Last Updated on Sun, Jan 15 2023 7:00 PM

Megastar Chiranjeevi Tweet Goes Viral Social Media - Sakshi

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సినిమాలోని సాంగ్స్ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఈ సినిమా చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ థియేటరల్లో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ సందడి చేస్తున్నారు. 

అయితే తాజాగా ఓ చిన్నారి సైతం మెగాస్టార్ పాటకు ఫిదా అయిపోయింది. థియేటర్లో సినిమా చూస్తూ కూర్చీపైనే స్టెప్పులతో అదరగొట్టింది.  పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చినప్పుడు ఆ చిన్నారి డ్యాన్స్‌ చేసిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ సైతం ఆ చిన్నారి డ్యాన్స్‌ను అభినందించకుండా ఉండలేకపోయారు. ఆ వీడియో క్లిప్‌ను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చిన్నారి డ్యాన్స్ చూసిన మెగా అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

మెగాస్టార్ ట్వీట్‌లో రాస్తూ..'ఎంత ఆనందం. ఇలాంటి చిట్టి చిట్టి ఫ్యాన్స్ రాకింగ్. 'పూనకాలు లోడింగ్' పాట నెక్ట్స్ జనరేషన్‌కి కూడా సెట్ అయ్యేలా కనిపిస్తోంది.' అంటూ పోస్ట్ చేశారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement