రష్యా ప్రతినిధులతో మెగాస్టార్ భేటి.. ఎందుకంటే? | Chiranjeevi hosts Russian delegates in Hyderabad to discuss collaborations | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్‌ను కలిసి రష్యా ప్రతినిధులు.!

Published Fri, Apr 19 2024 12:21 PM | Last Updated on Fri, Apr 19 2024 1:20 PM

Chiranjeevi hosts Russian delegates in Hyderabad to discuss collaborations - Sakshi

ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్‌ రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో నుంచి వచ్చిన  రష్యా బృందం నేరుగా హైదరాబాద్‌లోని చిరంజీవికి ఇంటికి వెళ్లి కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహకారంపై వారితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్‌తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. 

రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్‌ను ప్రమోట్ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మెగాస్టార్‌ను కలిసిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందంలోని సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చెర్కెజ్ జాడే, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్  మాస్కో, యూనివర్సల్ యూనివర్శిటీ డైరెక్టర్ మరియా సిట్‌కోవ్‌స్కాయా ఉన్నారు.

కాగా.. భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర. బింబిసార డైరెక్టర్‌ వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement