Mega 157: స్కూల్‌లో డ్రిల్‌ మాస్టర్‌గా చిరంజీవి! | Mega 157: Anil Ravipudi, Chiranjeevi Movie Latest Update | Sakshi
Sakshi News home page

Mega 157: స్కూల్‌లో డ్రిల్‌ మాస్టర్‌గా చిరంజీవి!

Jun 21 2025 2:18 PM | Updated on Jun 21 2025 3:14 PM

Mega 157: Anil Ravipudi, Chiranjeevi Movie Latest Update

కాలేజ్‌ లెక్చరర్‌గా చిరంజీవి ఆడియన్స్‌ను ఎలా ఎంటర్‌టైన్‌ చేశారో ‘మాస్టర్‌’ (1997) సినిమాలో చూశాం. మరి... స్కూల్‌లో డ్రిల్‌ మాస్టర్‌గా ప్రేక్షకులను ఎలా మెప్పించనున్నారో వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌కి వెళ్లి చూడొచ్చట. చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

(చదవండి: 'కుబేర' విలన్.. ఇతడు ఎవరో తెలుసా?)

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో స్కూల్‌ డ్రిల్‌ మాస్టర్‌ శివశంకర వరప్రసాద్‌గా చిరంజీవి కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అలాగే గురువారంతో ముస్సోరీలో పూర్తయిన ఈ సినిమా రెండో షూటింగ్‌ షెడ్యూల్‌లో స్కూల్‌ నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరించారట అనిల్‌ రావిపూడి. ఈ సీన్స్‌లో చిరంజీవి, నయనతారతో పాటు ఈ చిత్రం ప్రధాన తారాగణం పాల్గొన్నట్లుగా తెలిసింది. 

ఇంకా ఈ సినిమాలోని ఓ అతిథి ΄ాత్రలో వెంకటేశ్‌ నటిస్తారని, నటి క్యాథరీన్‌ మరో కీలక పాత్రలో కనిపిస్తారని టాక్‌. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.   

 

Advertisement
 
Advertisement
Advertisement