క్లీంకార‌పై స్పెష‌ల్ సాంగ్‌.. విన్నారా? | Special Song Released On Ram Charan And Upasana Konidela Daughter Klin Kaara, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Klin Kaara Konidela Special Song: చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ల కూతురిపై స్పెష‌ల్ సాంగ్ రిలీజ్‌..

Published Tue, Jan 16 2024 8:43 AM

Klin Kaara: Special Song on Ram Charan, Upasana Daughter - Sakshi

రామ్‌చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల‌కు పెళ్లైన 11 ఏళ్ల‌కు బుజ్జాయి పుట్టింది. గ‌తేడాది జూన్‌లో జ‌న్మించిన‌ ఈ పాపాయికి క్లీంకార అని నామ‌క‌ర‌ణం చేశారు. ఇదేదో అల్లాట‌ప్పాగా పెట్టిన పేరు కాదు! ల‌లితా స‌హ‌స్ర‌నామాల నుంచి తీసుకున్న ప‌దం. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంద‌ని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వెనుక సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు.

ఇక క్లీంకార పుట్టిన‌ప్ప‌టినుంచి మెగా ఫ్యామిలీ ప్ర‌తి పండ‌గ‌ను మ‌రింత వేడుకగా సెల‌బ్రేట్ చేసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే సంక్రాంతిని ఎంతో గ్రాండ్‌గా జ‌రుపుకున్నారు.హైద‌రాబాద్‌లో కాకుండా బెంగ‌ళూరులో వేడుక‌లు జ‌రుపుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ వేడుక‌ల్లో పాల్గొన‌డం విశేషం. ఇదిలా ఉంటే క్లీంకార గురించి ఓ పాట రెడీ చేశారు మెగా ఫ్యాన్స్‌. దీన్ని సంక్రాంతి కానుక‌గా ఉపాస‌న విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హ‌వీర్ ఎల్లంద‌ర్ కంపోజ్ చేసిన ట్యూన్‌కు త‌గ్గ‌ట్లుగా బెల్లంకొండ శ్రీధ‌ర్ లిరిక్స్ రాశాడు. దీన్ని ధ‌నంజ‌య్ అద్భుతంగా ఆల‌పించాడు.

చ‌ద‌వండి: పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో హీరోయిన్‌ సంక్రాంతి వేడుక‌లు

Advertisement
Advertisement