
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సినిమాలతో సంబంధం లేకపోయినా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా అందరికీ సుపరిచితమే.

అయితే రామ్ చరణ్ తల్లి సురేఖ కొన్ని నెలల క్రితమే అత్తమ్మాస్ కిచెన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే పులిహోర, రసమ్, ఉప్మా, కేసరి లాంటి ప్రొడక్ట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

తాజాగా ఈ లిస్ట్‌లో ఆవకాయ పచ్చడి కూడా చేరింది.

ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.





