Upasana Konidela Mother Did Shocking Things When Her Grand Daughter Klin Kaara Came To Home, Deets Inside - Sakshi
Sakshi News home page

Klin Kaara Konidela: మనవరాలికి దిష్టి తీయించిన ఉపాసన తల్లి.. పనివాళ్లకు ఎంత డబ్బిచ్చిందంటే?

Aug 5 2023 5:04 PM | Updated on Aug 5 2023 6:15 PM

Upasana Konidela Mother Did Shocking Things When Her Grand Daughter Klin Kaara Came To Home - Sakshi

ఈ క్రమంలో ఉపాసన తల్లి శోభన మనవరాలి కోసం ఘనమైన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. తన మనవరాలిని ఇంట్లోకి తీసుకొచ్చేముందు పనివాళ్లతో దిష్టి తీయించిందట!

వారసురాలి రాకతో మెగా కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతోంది. భార్య ఉపాసన గర్భంతో ఉన్నప్పుడే క్లీంకార ఎన్నో సంతోషాలను, అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోయాడు రామ్‌చరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ రావడం, ప్రపంచవ్యాప్తంగా తన నటనకు ప్రశంసలు దక్కడం, ఈ శుభసూచకాలన్నీ తన కూతురు వల్లే జరిగాయని మురిసిపోయాడు. క్లీంకార పుట్టిన తర్వాత వారి సంతోషం రెట్టింపయింది. ఇకపోతే చిరంజీవికి కోకాపేటలో ఉన్న ఆస్తుల రేట్లు పెరగడాన్ని కూడా క్లీంకారతో ముడిపెడుతున్నారు మెగా అభిమానులు. క్లీంకార అడుగుపెట్టిన వేళావిశేషం.. చిరు కుటుంబానికి అన్నీ కలిసొస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి ఉపాసన పుట్టింటికి వెళ్లినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరలవుతోంది. ఈ క్రమంలో ఉపాసన తల్లి శోభన మనవరాలి కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిందట! తన మనవరాలిని ఇంట్లోకి తీసుకొచ్చేముందు పనివాళ్లతో దిష్టి తీయించిందట! అంతేకాదు, దిష్టి తీసిన పనివాళ్లకు ఏకంగా రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఓ వార్త వైరలవుతోంది. తర్వాత కూతురిని ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె మనవరాలితో ఆడుకుందట!

అయినా దిష్టి తీసినందుకు వందలు, వేలు ఇస్తారు, అంతేకానీ ఇలా లక్షల్లో డబ్బు ఇవ్వడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెగా అభిమానులు మాత్రం.. తన మనవరాలు తొలిసారి ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో పనివాళ్లకు బహుమతి ఇచ్చిందనుకోవచ్చుగా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మెగా మనవరాలు క్లీంకార మాత్రం అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది!

చదవండి: రూ.2 లక్షలిస్తా.. కమిట్‌మెంట్‌ ఇస్తావా? అని అడిగాడు: హీరోయిన్‌
లలిత్‌ మోదీతో బ్రేకప్‌.. క్లారిటీ ఇచ్చేసిన సుష్మితా సేన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement