వర్ష సూచన.. సన్‌రైజర్స్‌-ఢిల్లీ మ్యాచ్‌ జరిగేనా..? | IPL 2026: Thunderstorms and Rain may Impact SRH vs DC match | Sakshi
Sakshi News home page

వర్ష సూచన.. సన్‌రైజర్స్‌-ఢిల్లీ మ్యాచ్‌ జరిగేనా..?

Apr 21 2026 1:28 PM | Updated on Apr 21 2026 2:03 PM

IPL 2026: Thunderstorms and Rain may Impact SRH vs DC match

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 21) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ పోరు హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామంగా చెప్పవచ్చు.

అయితే ఆసక్తికరంగా ఇక్కడ పేసర్లు అధికంగా ప్రభావం చూపుతున్నారు. సుమారు 72 శాతం వికెట్లు వీరే తీశారు. ప్రారంభ ఓవర్లలో స్వల్ప స్వింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త బంతితో బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే వికెట్లు తీసే అవకాశం ఉంటుంది.

ప్రారంభ ఒత్తిడిని ఎదుర్కొని బ్యాటర్లు సెటిల్ అయితే మాత్రం భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌ చేయడానికి మొగ్గు చూపవచ్చు.

వాతావరణ నివేదిక
ఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. వాతావరణం మేఘావృతంగా ఉంటే మాత్రం పేసర్ల అధిక సహకారం లభిస్తుంది. మొత్తంగా మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశం కేవలం 2 శాతంగా మాత్రమే ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement