నాగార్జున పుట్టినరోజున 'గీతాంజలి' మరోసారి | Nagarjuna Geethanjali Movie Re Release Latest Update | Sakshi
Sakshi News home page

Geethanjali Movie: నాగార్జున పుట్టినరోజున 'గీతాంజలి' మరోసారి

Aug 19 2026 4:45 AM | Updated on Aug 19 2026 4:46 AM

Nagarjuna Geethanjali Movie Re Release Latest Update

హీరో అక్కినేని నాగార్జున అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా నటించిన క్లాసిక్‌ హిట్‌ మూవీ 'గీతాంజలి' మరోసారి వెండితెరపైకి వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న శ్రీ పద్మిని సినిమాస్‌ ద్వారా తెలుగు, తమిళంలో బూర్లె శివ ప్రసాద్‌ 4కెలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. నాగార్జున, గిరిజ జోడీగా లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం తెరకెక్కించిన మూవీ ఇది. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1989 మే 12న విడుదలై, ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది.

ఇప్పుడు నాగార్జున బర్త్‌ డే సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ‘‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునని ఎంతో ఛార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది.

మణిరత్నం తనదైన స్టోరీ టెల్లింగ్‌తో ఈ ప్రేమకథను ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచి, ‘గీతాంజలి’ని క్లాసిక్‌గా మార్చింది. 4కే ఫార్మాట్‌లో ‘గీతాంజలి’ని చూడటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని బూర్లె శివ ప్రసాద్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement