ఏఐ టూత్‌ బ్రెష్‌..దెబ్బకు నోటి సమస్యలకు చెక్‌! | Couple tests Rs 47,000 toothbrush equipped with camera, torch and AI | Sakshi
Sakshi News home page

ఏఐ టూత్‌ బ్రెష్‌..దెబ్బకు నోటి సమస్యలకు చెక్‌!

Sep 8 2026 11:00 AM | Updated on Sep 8 2026 11:45 AM

Couple tests Rs 47,000 toothbrush equipped with camera, torch and AI

ఎటు చూసినా ఏఐ సాంకేతికత హవానే. ప్రతిదానిలో ఏఐ ఫీచర్లతో మోత మోగించేస్తూ..పనులన్నీ చిటికెలో అయిపోయేలా వస్తున్నాయి అన్ని గాడ్జెట్లు. తాజాగా రోజువారీ దినచర్యలో నిత్యకృత్యమైన బ్రెషింగ్‌లో కూడా ఈ ఫీచర్‌ వచ్చేసింది. దంతాల క్లీనింగ్‌ కోసం డెంటిస్ట్‌ దగ్గరకు వెళ్లక్కర్లేకుండా చక్కగా పళ్లు తళతళ మెరిసేలా స్వయంగా క్లీన్‌ చేసుకునే ఏఐ టూల్‌ బ్రెష్‌ వచ్చేసింది. దీని పనితీరు చూస్తే మైండ్‌బ్లాక్‌ అయిపోవడం ఖాయం. ఇంతలా క్లీన్‌ చేస్తుందా అని కచ్చితంగా నోరెళ్లబెడతారు. 

అందుకు సంబంధించిన వీడియోని ఓ జంట నెట్టింట పంచుకుంది. మరి ఆ ఏఐ టూత్‌ బ్రెష్‌ విశేషాలేంటో సవివరంగా చూద్దామా మరి..!.

కంటెంట్‌ క్రియేటర్లైన ఓ జంట "దిఆలివ్‌ట్రీఫ్యామిలీ" అనే పేరుతో ఓ వీడియోని నెట్టింట షేర్‌ చేశారు. ఆ వీడియోలో అంతర్నిర్మిత  కెమెరా, టార్చ్‌తో కూడిన ఏఐ ఫాసింగ్‌ క్లీనింగ్‌తో కూడిన టూత్‌ బ్రెష్‌ పని తీరు గురించి పంచుకున్నాడు. డైసన్‌ అనే కంపెనీ ఏఐ సాంకేతికతో కూడిన ఈ ఆధునిక బ్రష్‌ని రూపొందించింది. వాళ్లు ఆ బ్రెష్‌ని ఎలా ఉపయోగించుకోవాలో ఎలా ఛార్జ్‌ చేయాలి వంటి వాటితో సహా..ఉపయోగించే విధానం కూడా పంచుకున్నారు. టూత్‌ పేస్ట్‌ని బ్రెష్‌పై పెట్టి నోటిలో పెట్టగానే ప్రతిదీ వీడియో తీస్తూ..పళ్ల సందుల్లో ఇరుక్కుపోయిన ఆహారాన్ని క్లీన్‌ చేస్తుంది. ఎక్కడ చిన్న మెతుకు ఇరుక్కుపోయినా వదలదు. అది కూడా తక్కువ టైంలోనే సమర్థవంతంగ పంటి సమస్యల బారిన పడకుండా అద్భుతంగా క్లీన్‌ చేయడం స్పష్టంగా వీడియోలో చూడొచ్చు. 

అలాగే ఈ బ్రష్‌ని డిజైన్‌ చేసిన సంస్థ సైతం ఇది దంతాల మధ్య ఉన్న ఖాళీలను లక్ష్యంగా చేసుకుని పాచిని తొలగించే ఏకైక బ్రెష్‌గా అభివర్ణించింది. ఇది జెట్‌ వాషింగ్‌, లిక్విడ్‌ వాషింగ్‌, మౌత్‌ వాష్‌ వంటి క్లీనింగ్‌ పద్ధతులను అందిస్తుంది. సాధారణంగా ఫాసింగ్‌ అనేది కాస్త సమయం ఎక్కువ తీసుకునే పద్ధతి. అందరూ దీన్నిచేయలేరు కూడా. అదే  సాంకేతికతో కూడిన అత్యాధునిక ఈ టూత్‌బ్రెష్‌తో జస్ట్‌ ఓ మూడు నిమిషాల్లో పళ్లన్నీ శుభ్రపడాయి. 

పాచి, పసుపు గార వంటి ఇబ్బంది లేకుండా తళతళ మెరిసిపోయేలా చేస్తుంది. దీని ఫీచర్స్‌ చూస్తుంటే..నోటి ఆరోగ్యానికి బెస్ట్‌ టూత్‌ బ్రెస్ట్‌గా తెలుస్తోంది. అదీగాక నోటి సంరక్షణ పద్ధతులపై జరుగుతున్న పరిశోధనల్లో నోటిలో మలినాలు ఎలా పేరుకుపోతాయో, అలాగే పళ్ల మధ్య ఉండే ఖాళీల్లో మలినాలు  ఎలా చేరుకుంటాయో  వెల్లడించింది. వీటిని క్లీన్‌ చేయడం చాలా మంది ప్రజలు మర్చిపోతున్నట్లు సర్వేలో తేలింది కూడా. 

అలాంటి తరుణంలో ఈ సరికొత్త ఫీచర్లున్న టూత్‌ బెస్ట్‌ అందరికీ ఆమోదయోగ్యకరమైనదని అంగీకరించవచ్చు. పైగా దీని ధర కూడా కేవలం రూ. 47 వేలు. అందరు కొనలేకపోయినా..సామాన్యుడు కూడా కొనేలా త్వరలో తక్కవ ధరలో లభించేవి కూడా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం లేకపోలేదనే చెప్పొచ్చు.

(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement