ఆర్ట్ కనెక్ట్, గోండ్వానా ఆర్ట్ ప్రాజెక్ట్ సహకారంతో, మధ్య భారతదేశంలోని దేశీయ కళా సంప్రదాయాల మూలాల్లోకి తొంగిచూసే 'మూల్ – ది ఆరిజిన్' అనే ప్రదర్శనను అందిస్తోంది. ఇది కళలు ఎలా రూపాంతరం చెందుతూ..సరికొత్తగా ఎలా వ్యక్తీకరణను పొందుతున్నాయో ఈ ప్రదర్శన చూపిస్తుంది. ఈ ప్రధర్శన ఈ నెల 10 నుంచి సెప్టెంబర్ 13 వరకు హైదరాబాద్, ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోస్ సమీపంలోని స్పిరిట్ కనెక్ట్‌లో జరగనుంది.
దీని ప్రధాన ఉద్దేశ్యం మన మూలాల్లో తిరిగి వెళ్లడం, అలాగని గతంలోకి వెళ్లమని కాదట. ఈ ప్రదర్శనలో కళఖాండాలు తమ మూలాలతో ఎలా గాఢంగా పాతుకుపోయి ఉంటాయో నేటి ప్రపంచానికి తెలియజేస్తాయని అంటున్నారు నిర్వహకులు. సుపరిచితమైన చిహ్నాలు, నమునాలు ఎలా కళాకారుల నుంచి మార్పులు సంతరించుకున్నాయో తెలియజేస్తుందట ఈ ప్రదర్శన. ఇక్కడ సంప్రదాయన్ని స్థిరంగా నిలిచిపోయే వస్తువుగా ప్రదర్శించకుండా సజీవ భాషగా, మన వారసత్వంగా కళాకారులు ముందుకు తీసుకెళ్తారనేది చెప్పడానికే ఈ ప్రదర్శన అని ఈ ఆర్ట్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు చెబుతున్నారు.


