సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్‌లోని 4,356 చదరపు గజాల స్థలానికి సోమవారం హెచ్‌ఎండీఏ బిడ్డింగ్ నిర్వహించింది. గజానికి రూ.1,50,000 కనీస ధర నిర్ణయించగా, అత్యధికంగా రూ.1,64,000 నమోదైంది. వేలం ద్వారా రూ.71.44 కోట్ల ఆదాయం సమకూరింది. వేలం వేసిన భూమి.. సరూర్‌నగర్‌లోని ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో వ్యాపార వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్‌ను ఈ ధర ప్రతిబింబించిందని తెలిపారు.
చదవండి: ‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్‌ను ఓదార్చిన సీఎం రేవంత్


