వినతిపత్రం అందిస్తున్న మహిళా సర్పంచుల ప్రతినిధి రాగిడి మంగ
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామ సర్పంచ్ రాగిడి మంగపై వానరాలు సోమవారం దాడి చేయగా గాయాలయ్యాయి. విధులు నిర్వర్తించేందుకు తన ఇంటినుంచి బయటకు వెళ్తుండగా అక్కడే గుంపుగా ఉన్న కోతులు అకస్మాత్తుగా మంగపై దాడి చేశాయి. ఆమె కాలికి తీవ్రగాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కోతులు, కుక్కల బారినుంచి కాపాడాలి
22 గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద అధికమైందని వాటిబారి నుంచి తమను కాపాడాలని మహిళా సర్పంచుల ప్రతినిధి, జీలకుంట సర్పంచ్ రాగిడి మంగ స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
కోతికి భయపడి.. జారిపడి
పెద్దపల్లిరూరల్: వానర సేన ఇళ్లపైకే కాదు.. పత్తి చేల వద్దకూ వెళ్లి రైతులు, రైతు కూలీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇందుకు పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో సోమవారం పత్తి చేనువద్ద కలుపు తీసి పొలంగట్టు పైకి వచి్చన స్వప్నపై కోతుల గుంపు దాడికి యత్నించడంతో పరుగెత్తబోయి జారిపడడంతో గాయాలపాలైంది. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన స్వప్న కాలికి గాయమై నడవలేని స్థితికి చేరింది.
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో ఫారెస్టు నర్సరీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే విజయరమణారావుకు సైతం కోతుల బెడద పలుగ్రామాల్లో ఎక్కువ ఉందని నియంత్రించేందుకు చొరవ చూపాలని వేడుకున్నారు.
చదవండి: భర్త ఫోన్ ఎత్తలేదని భార్య ఆత్మహత్య


