కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ చుట్టూ పోలీసుల చక్కర్లు | Tension In Erravelli As Congress Calls For KCR Farmhouse Siege And Heavy Police Deployment | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ చుట్టూ పోలీసుల చక్కర్లు

Sep 8 2026 9:29 AM | Updated on Sep 8 2026 10:03 AM

Tension in Erravelli as Police Tighten Security Around KCRs Farmhouse

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌( ఫైల్‌ ఫొటో)

సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ నిరసనలకు దిగింది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ ముట్టడికి పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్‌ విధించి.. పోలీసులు భారీగా భద్రతను మోహరించారు. 

144 సెక్షన్‌ అమల్లో ఉండటంతో కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వైపు ఎవరినీ అనుమతించడం లేదు.  అటు వైపు అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేసి, చుట్టుపక్కల పోలీసు వాహనాలతో నిరంతరం పహారా కాస్తున్నారు. ఇటు మర్కుక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. 

ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు డీసీఎంలను సైతం పోలీసులు సిద్ధంగా ఉంచారు. మరోవైపు ఎర్రవెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ధర్నా శిబిరాన్ని పోలీసులు ఎత్తివేయడంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి: రేవంత్‌ సర్కార్‌పై హరీష్‌రావు ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement