అక్రమ అరెస్టులు దారుణం | - | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్టులు దారుణం

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

అక్రమ అరెస్టులు దారుణం

బీజేపీ రాష్ట్ర నాయకులు బాలేష్‌గౌడ్‌

దుబ్బాక: కాంగ్రెస్‌ సర్కార్‌ పిరికితనానికి అక్రమ అరెస్టులే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. విద్యార్థుల వేల కోట్ల ఫీజు బకాయిలు ఎగ్గొట్టడాన్ని నిరసిస్తూ సోమవారం బీజేపీ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కి వెళ్లనివ్వకుండా దుబ్బాకలో పోలీసులు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎగ్గొట్టి 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును రేవంత్‌ సర్కార్‌ కాలరాస్తుందన్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా బాలేష్‌గౌడ్‌తోపాటు బీజేపీ దుబ్బాక మున్సిపల్‌ అధ్యక్షులు శ్రీకాంత్‌యాదవ్‌, ప్రవీణ్‌కుమార్‌, రమేశ్‌రెడ్డి, రమణారెడ్డి, నేహాల్‌గౌడ్‌, మనోజ్‌గౌడ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement