మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు
సిద్దిపేటఅర్బన్/సిద్దిపేటరూరల్: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాక్షస పాలన సాగుతోందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు వ్యాఖ్యానించారు. సోమవారం శాసనసభ సమావేశాలకు వెళ్తున్న హరీశ్‌రావు, కేటీఆర్‌లతో పాటు పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పొన్నాల వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హరీశ్‌రావు, కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు భౌతిక దాడులు చేయడం హేయమన్నారు. అనంతరం నాయకులు కలెక్టర్ వద్దకు చేరుకుని కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో కలెక్టర్ కె.హైమావతికి వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


