జీవో 97 రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీవో 97 రద్దు చేయాలి

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

జీవో 97 రద్దు చేయాలి ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా ఫణీందర్‌ సుఖసంతోషాలతో ఉండాలి

బీఆర్‌ఎస్‌వీ నేతలు

హుస్నాబాద్‌: జీవో 97 రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థులతో కలిసి బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ రామ్మూర్తికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురామ్‌ మాట్లాడుతూ... ప్రభుత్వం తెచ్చి న జీవో 97వల్ల పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యార్థులకు భరోసా కల్పించి ఉన్నత చదువులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. చీకటి జీవోలు తెచ్చి విద్యార్థులను ఇబ్బంది పెడితే బీఆర్‌ఎస్‌వీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ, యూత్‌ నాయకులు అమర్‌, శ్యామ్‌, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఖమ్మంలో జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో జిల్లా కన్వీనర్‌గా ఫణీందర్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏబీవీపీ జిల్లా నాయకులు సోమవారం మీడియాకు తెలిపారు. జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఫణీందర్‌ స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

బక్కి వెంకటయ్య

దుబ్బాకరూరల్‌: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ఆకాంక్షించారు. శ్రావణమాసం ఆఖరి సోమవారం పురస్కరించుకుని అక్బర్‌పేట భూంపల్లి మండలం చౌదర్‌పల్లిలో శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సులోచనస్వామి, ఆలయ పూజారి భాను తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

టీపీసీసీ అధికార ప్రతినిధి

బండారు శ్రీకాంత్‌రావు

గజ్వేల్‌: సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరమని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు తెలిపారు. గజ్వేల్‌ మండలం జాలిగామలో అనారోగ్యంతో బాధపడుతున్న మహ్మద్‌ ఖాజాబేగంకు రూ.5లక్షల ఎల్‌ఓసీ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రావు మాట్లాడుతూ...ఆర్థిక పరిస్థితులు చితికిపోయి మెరుగైన చికిత్స చేయించుకోలేని పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అండగా నిలుస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాచారం ట్రస్ట్‌బోర్డు డైరెక్టర్‌ నాయకం శ్రీనివాస్‌, కొండపోచమ్మ ఆలయ డైరెక్టర్‌ ఆనంద్‌, నాయకులు యాదగిరి, నవీన్‌గౌడ్‌, గోవింద్‌, మనోజ్‌కుమార్‌, నవీన్‌చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement