బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఆగ్రహం | Telangana Assembly Sessions On September 8th 2026 Day 2 Live Updates, Top News Headlines And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఆగ్రహం

Sep 8 2026 9:15 AM | Updated on Sep 8 2026 10:36 AM

Telangana Assembly Sessions September 8 2026 Day 2 Updates

సాక్షి, హైదరాబాద్‌: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే గందరగోళం చెలరేగింది. బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్‌తో ఎ‍మ్మెల్యే హరీష్‌ రావు వాగ్వాదానికి దిగారు. మీరు లొల్లి పెడితే భయపడేది లేదంటూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. 

అసెంబ్లీ ఆవరణలో మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

  • నవీన్ మిట్టల్ పీఎస్‌ రాజు అకస్మాత్తుగా కుప్పకూలడంతో వెంటనే స్పందించిన మంత్రి
  • ఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్‌ చేసి ప్రథమ చికిత్స అందించిన మంత్రి
  • వైద్య సిబ్బందిని పిలిపించి.. బాధితుడిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేలా చర్యలు

మహిళల పట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గౌరవం లేదు: మంత్రి సీతక్క

  • ఎలాంటి కారణం లేకుండా కవితను సస్పెండ్ చేశారు

  • హరీష్ రావును విమర్శించినందుకు కవితను సస్పెండ్ చేశారు

  • మహిళా ఎమ్మెల్యేలను ముందుకు నెట్టిందే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు

  • మహిళా పోలీసులపై కేటీఆర్ దురుసుగా ప్రవర్తించారు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఆగ్రహం

  • నా సంగతి ఏంటో హరీష్ రావు చెప్పాలి
  • మీ తల్లిని కాదు.. నా తల్లిని అన్నారు

గడ్డం ప్రసాద్ పట్ల మాకు గౌరవం: హరీష్ రావు

వ్యక్తిగతంగా నాకు చైర్ పైన రెస్పెక్ట్ ఉంది
స్పీకర్‌ను ఉద్దేశించి అనలేదని తాత మధు అన్నారు
లిఖిత పూర్వకంగా తన వివరణను మీడియా కూడా ఇచ్చారు
అలా భావించి ఉంటే విచారం వ్యక్తం చేశాడు.
మేము విచారణ వ్యక్తం చేస్తున్నాం

సీఎం రేవంత్‌కు కౌశిక్‌రెడ్డి సవాల్

  • కొడంగల్‌లో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే.. నేను హుజూరాబాద్‌లో రాజీనామా చేస్తా
  • రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా
  • రేవంత్ రెడ్డి మాడ్లాడిన భాష.. ఉపయోగించిన పదజాలం తెలంగాణ సమాజం మొత్తం చూసింది
  • అసెంబ్లీ సాక్షిగా సీఎం మాట్లాడిన భాష అభ్యంతరకరం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక పోస్ట్

  • తల్లిని అవమానించిన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి
  • తాత మధు వ్యాఖ్యలపై పొంగులేటి ట్వీట్‌

బీజేపీ వాయిదా తీర్మానం

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై చర్చించాలని డిమాండ్
  • వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement