హైదారబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ టి.ఉషారాణిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ పోస్టులో కొనసాగిన డా.వాణి డీఎంఈగా పదోన్నతిపై వెళ్లడంతో సూపరింటెండెంట్ పోస్టు సుమారు నెల రోజులు ఖాళీగా ఉంది. దీంతో ప్రభుత్వం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఉషారాణిని గాంధీ ఆసుపత్రికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గాంధీ ఆస్పత్రిలో అదనపు డీఎంఈగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సీహెచ్ రాజకుమారిని పరిపాలనా కారణాలతో తక్షణమే రిలీవ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు జీఓ జారీ చేశారు.
చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?


