మళ్లీ జతకట్టిన 'కోర్ట్‌' జంట.. శ్రీదేవి నోట బూతులు | Bandmelam Movie Glimpse: Roshan & Sridevi Reunite After ‘Court’ Success | Sakshi
Sakshi News home page

Sridevi - Roshan: 'కోర్ట్‌' జంట కొత్త మూవీ.. శ్రీదేవి నోట బూతులు

Sep 17 2025 11:13 AM | Updated on Sep 17 2025 12:11 PM

Court Fame Sridevi, Roshan New Movie Band Melam Glimpse Released

'కోర్ట్‌' సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్‌ (Harsh Roshan)-శ్రీదేవి (Sridevi) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్‌మేళం (Band Melam Movie). సతీశ్‌ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రోషన్‌.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్‌ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్‌ వినిపించాడు. 

మాస్‌ డైలాగ్స్‌
అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్‌ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్‌ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా రోషన్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్‌ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్‌ ఇచ్చాడు. 

సినిమా
అరవింద సమేత, వెంకీ మామ, సలార్‌, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్‌, సరిపోదా శనివారం, మిషన్‌ ఇంపాజిబుల్‌.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్‌ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్‌ మీడియాలో ఆమె రీల్స్‌ చూసి తనను కోర్ట్‌ మూవీకి సెలక్ట్‌ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్‌తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది.

 

చదవండి: 4 రోజులుగా మాస్క్‌ మ్యాన్‌ నిరాహార దీక్ష! నామినేషన్స్‌లో ఏడుగురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement