కోర్ట్‌ తర్వాత సినిమాలు వద్దని చెప్పా.. నా మాట వినలేదు! | Court Director Ram Jagadeesh Comments at Band Melam Pre Release Event | Sakshi
Sakshi News home page

సినిమాలు మర్చిపోమన్నా, నా మాట వినలేదు: కోర్ట్‌ డైరెక్టర్‌

Mar 24 2026 11:46 AM | Updated on Mar 24 2026 11:57 AM

Court Director Ram Jagadeesh Comments at Band Melam Pre Release Event

కోర్ట్‌ సినిమాతో హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి వెండితెరపై హీరోహీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాకే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిలో పడ్డారు. గతేడాది కోర్ట్‌ మూవీతో పలకరించిన ఈ జంట ఈ ఏడాది బ్యాండ్‌మేళంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రిరీలీజ్‌ ఈవెంట్‌లో కోర్ట్‌ డైరెక్టర్‌ రామ్‌ జగదీశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

సినిమాలు మర్చిపోండి
ఆయన మాట్లాడుతూ.. చందు-జాబిలి(కోర్ట్‌ మూవీలో ప్రధాన పాత్రల పేర్లు).. వీళ్లనెప్పటికీ ఇదే పేర్లతో పిలుస్తుంటాను. కోర్ట్‌ తర్వాత వీళ్లు ఏం చేస్తారు? ఏమైపోతారనుకున్నాను. నేనైతే.. కోర్ట్‌ అయిపోగానే మీరు కనపడొద్దని చెప్పాను. సినిమాలు మర్చిపోండి, మూడునాలుగేళ్లు కనిపించకూడదు. మంచి కాలేజీలో చేరి చదువుకోమని చెప్పాను. పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు కానీ కాలేజీకి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. 

కాలేజీ డేస్‌ మిస్‌ 
మీరు ఫస్ట్‌ కాలేజీకి వెళ్లండి, కళాశాల జీవితాన్ని మిస్‌ అవొద్దని చెప్పాను. ఈ వయసులో యాక్టింగ్‌లో బిజీ అయితే జీవితంలో ముఖ్యమైన కాలేజీ డేస్‌ మిస్‌ అవుతారన్నాను. కానీ నా మాట వినలేదు. వినుంటే బ్యాండ్‌ మేళం వచ్చేది కాదు.. విననందుకు థాంక్స్‌ అన్నాడు. బ్యాండ్‌మేళం విషయానికి వస్తే.. సతీశ్‌ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీని కోన వెంకట్‌ నిర్మించారు.

చదవండి: ధురంధర్‌ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement