కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండ్‌మేళం. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం (మార్చి 24) ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు దర్శకులు వివి. వినాయక్, బాబీ, నిర్మాత బండ్ల గణేశ్, హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


