
ఇప్పుడంతా డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నాం. ప్రతిదీ ఆన్‌లైన్ మయం. ఫోన్‌స్క్రీన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడకుండా పనులు అవ్వని కాలం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో..చాలామంది వెన్నునొప్పి, కాలునొప్పి వంటి సమస్యల కంటే కంటి సమస్యల బారినపడే వారి సంఖ్య అధికంగా ఉంది. అందుకు చిన్న, పెద్ద అనే భేధం లేదు. ఇక్కడ అనన్య దేశాయ్ అనే టీనేజర్ టెక్కీ కూడా ఇలానే బాధపడుతోంది. నిద్ర లేవడంతోనే నేరుగా వేటిని చూడలేదు. చాలాసేపు వరకు చూపు స్పష్టంగా కనిపించదామెకు. ఆమె తీవ్రమైన మయోఫియాతో బాధపడుతోంది. ఆమె అమ్మమ్మ గ్లాకోమాతో ఇబ్బందిపడటం దగ్గర నుంచి చూసిన ఆమె తన సమస్యను మరి ఆ స్థాయిలోకి రానివ్వకూడదనుకుంది. అలా పుట్టుకొచ్చిందే కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వెబ్‌సైట్. ఏంటిది..? ఇది మన కళ్లను ఎలా సంరక్షిస్తుందంటే..
అనన్య ఆన్‌లైన్ తరగతులు, ఇంటర్‌లో నోట్స్, కోడింగ్ అసైన్‌మెంట్‌లు వంటి అన్నింటి కోసం గంటల తరబడి స్క్రీన్‌లపై ఆధారపడాల్సి వచ్చింది. దాంతో తలనొప్పి, కంటి ఒత్తిడి వంటి పరిస్థితులను ఎదుర్కొని మెరుగైన చూపుని ఎంతమేర కోల్పోయిందో తెలుసుకుంది అనన్య. దాంతో తీవ్రమైన మయోపియా బారిన పడింది. దీని కారణంగా అనన్య కంటి లెన్స్ లేదా కళ్ల జోడులు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి.
అందుకామె కంటి చూపుని తేలిగ్గా చూడొద్దని హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి వల్లే తనకు స్క్రీన్ వాడకం ఎక్కువైందని అది మొత్తం జీవితాలనే మార్చేసిందని అంటోంది. తనకున్న కోడింగ్ అభిరుచితో ఈ సమస్యకు చెక్‌పెట్టగలనా అని ఆలోచించడం ప్రారంభించింది. అలా పుట్టుకొచ్చిందే ఈ విజువల్ ఐస్ వెబ్‌సైట్.
ఏంటి వెబ్‌సైట్..
ఇది డిజిటల్ కంటి ఒత్తిడిని అధిగమించడంలో హెల్ప్ అవుదుంది. ఇది 20-20-20 రూల్‌తో రూపొందించింది. ఏఐ ఆధారిత ఆరోగ్య చిట్కాల్లో ఈ 20 రూల్ కంటి ఆరోగ్యానికి హెల్ప్ అవుతుందని తెలుసుకుంది అనన్య. అదే ఆమెకు కంటి ఆరోగ్యాన్ని కాపాడే వెబ్‌సైట్‌ని రూపొందించేందుకు ప్రేరణ ఇచ్చింది.
అలా అనన్య కంప్యూటర్ విజన్ సిండ్రోమ్(CVS)గా పిలిచే ఈ డిజిటల్ కంటి ఒత్తిడిని నివారించడానికి ఈ ఐస్ వెబ్‌సైట్‌ని రూపొందించింది అనన్య. తనకున్న కోడింగ్ సామర్థ్యంతో ఈ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే..ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్‌ల నుంచి విరామం తీసుకుని 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడటం. అదే ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది.
ఎందుకు మంచిదంటే..
ఇది కంటి ఫోకసింగ్ వ్యవస్థను రీసెట్ చేస్తుంది. కార్నియల్ ఉపరితలాన్ని రీహైడ్రేట్ చేయడానికి, రెప్పవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇంటెన్సివ్ స్క్రీన్ పనిలో నిమగ్నమైన వ్యక్తులకు దృశ్య అలసట, కంటి ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఈ వెబ్‌సైట్ మన కంప్యూటర్ స్క్రీన్‌పై ఫోకస్ టైమర్ ద్వారా 20 నిమిషాల రిమైండర్ ప్రతిసారి దీన్ని గుర్తు చేస్తుందని చెబుతున్నారు.
కాగా, అనన్య ఇలాంటి కంటి ఆరోగ్యానికి సంబంధించిన 20-20-20 రూల్ తోపాటు, ఆకుకూరలు, నట్స్, కంటి వ్యాయమాలతో తన దృష్టిని మరింతగా మెరుగుపరుచుకున్నట్లు వెల్లడించింది. ఇక్కడ తన కంటి పరిస్థితి కారణంగా ఎదురైన సవాళ్లు ఆవిష్కరణకు నాందిపలికింది. ఇక్కడ అనన్య స్టోరీ ప్రతి ఒక్కరూ తమకెదురైనా కష్టాన్ని లేదా సమస్యను మరో దృక్పథంలో చూడండి తప్ప నిరాస నిస్ప్రుహలకు లోనవ్వకూడదని తెలుపుతోంది.
(చదవండి: Dussehra 2025: ప్రపంచంలోనే అతి పురాతనమైన రాంలీలా ఇది..! ఎక్కడంటే..)