
దసరా వేడుకల్లో భాగంగా ఉత్తరభారతదేశం ఢిల్లీ తప్పనిసరిగా రాంలీలా ప్రదర్శన జరుగుతుంది. మన సంస్కృతికి అద్దం పట్టే ఈ ఇతిహాసం చెడుపై మంచి ఎప్పటికైనా గెలవాల్సిందే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే కాదు సత్ప్రవర్తనతో మెలిగేందుకు దోహదపడుతోంది. అలాంటి రాంలీల ప్రదర్శన ఎప్పుడు మొదలైంది..? ఎవరు ప్రారంభించారు..? అంటే..
ఈ రాంలీలా 485 ఏళ్ల క్రితమే కాళీలో ప్రారంభమైందట. వారణాసిలో జరిగే చిత్రకూట్ రాంలీలా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాంలీలా అట. 16వ శతాబ్దంలో 1540 ఆ సమయంలో జరిగిందట. ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతోందట. 16వ శతాబ్దంలో తులసీదాస్ రామచరితమానస్‌ని అవధి భాషలో రాశారు. ఆయన వారణాసిలో కూర్చొని రామ ధ్యానం, ఆయన కథ వినిపిస్తుండేవాడట. తనకు రామదర్శనం ఎప్పుడవుతుందని కుతుహలంగా ఎదురుచూసేవాడట. ఒకనొక సందర్భంలో అస్సీఘాట్‌లో తులసీదాస్ రామకథ చెబుతుండగా రాముడు, సీత, లక్ష్మణ సమేతంగా వెళ్తున్నట్లు దర్శనం పొందుతాడు.
ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన శిష్యుడు మేఘ భగవత్ ఈ రాంలీలా ప్రదర్శన సంప్రదాయాన్ని ప్రారంభించాడు. జనులంతా తులసీదాసు మాదిరిగా రాముడి అనుగ్రహానికి పాత్రులు కావాలనే ఉద్ధేవ్యంతో భగవత్ దీన్ని ప్రారంభించాట. వాస్తవానికి మేఘ భగవత్ రాంలీలా ప్రదర్శన వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందింపబడినప్పటికీ.. రాంలీలాని సంస్కృతంలోనే ప్రదర్శిస్తారట. అందువల్లే తులసీదాస్ రాసిన రామచరిత మానస్ ప్రసిద్ధికెక్కిందని చరిత్రకారులు చెబుతున్నారు.
ఎన్నో విశేషాలు..
ఇక్కడ రాంలీలా సుమారు 22 రోజులపాటు కొనసాగుతుందట. ముకుట్ పూజతో ప్రారంభమవుతుందట. రాముడు, లక్ష్మణుడు, సీత, ధరించే (ముకుట్)కిరీటాలకి పూజ చేయడంఓత ప్రారంభమవుతుంది. అంతేగాదు ఆ కిరీటాలు శతాబ్దాల నాటివని చెబుతుంటారు. అక్కడ ఈ వేకుడ కోసం చాలా పెద్ద ఆచారాన్ని నిర్వహిస్తారు అక్కడ. ఆ కిరీటాలను అలా పూజ చేసి పవిత్రంగా మార్చడంతో వాటిని ధరించిన మానవులు దేవతా స్వరూపులుగా కనిపిస్తారని అక్కడ ప్రజల నమ్మకం.
మరో ఆసక్తికరమైన ఘట్టం ఏంటంటే..నక్కటైయగా పిలిచే ఊరేగింపు. ఇది 12వ రోజు జరుగుతుంది. అప్పుడు శూర్పణఖ ఎపిసోడ్‌ని ప్రదర్శిస్తారు. పంచవటిలో రాముడి అందానికి మోహవశురాలైన ఘట్టం అత్యంత ముగ్ధమనోహరంగా జరుగుతుందట. అక్కడ కాశీ వీధులన్ని తిరుగుతూ నిర్వహిస్తారట ఆ సన్నివేశాన్ని. అంతేగాదు ఈ రాంలీలా నాటక ప్రదర్శన కోసం స్వచ్ఛందంగా దుకాణాలను బంద్ చేసి ప్రజలంతా గుమిగూడి మరి తిలికిస్తారట. అంత విశేషాలతో కూడుకున్నది అ చిత్రకూట్ రాంలీలా.
(చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..)