
దసరా అంటేనే తొమ్మిది రోజుల పండుగ. రోజుకో విధంగా అమ్మవారిని అలంకరించుకుని.. జగన్మాత శరణు అంటూ ఉపవాసాలతో కొలుచుకుంటారు భక్తులు. కొన్ని ప్రాంతాల్లో నవరాత్రుల్లో రాత్రి సమయంలో దాండియా, గర్భా, కోలాటం వంటి డ్యాన్స్‌లతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇలా మంచి మ్యూజిక్ లయబద్ధంగా డ్యాన్స్‌లు చేస్తూ చాలామంది ప్రాణాలను కోల్పోయారు. మరికొందరూ కాలి గాయాల బారినడ్డారు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉత్సాహంగా..హెల్దీగా పండుగను జరుపుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.
దసరా సరదా పదిలంగా ఉండాలంటే..సాయం సమయంలో చేసే నృత్యాల విషయంలో కాస్త కేర్‌ఫుల్‌గా ఉండమని చెబుతున్నారు సూరత్‌కి చెందిన ఆర్థోపెడిక్. రాత్రుళ్లు భక్తితో అమ్మవారి అనుగ్రహం పొందేలా గంటలతరబడి డ్యాన్స్‌లు చేస్తుంటారు. దాంతో కాలి గాయాలు బారిన పడటం లేదా, చీలమండలం, మోకాలు వంటి సమస్యలు తలెత్తేందుకు దారితీస్తాయి.
మరికొందరికి..జనం సముహం ఎక్కువగా ఉండి శ్వాసకు అంతరాయం లేదా, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలా జరగకుండా సంతోషభరితంగా, ఆరోగ్యప్రదంగా పండుగ వాతావరణం ఉండాలంటే..ఈ చిట్కాలను ఫాలోకండి అని చెబుతున్నారు వైద్యులు.
హెల్దీగా ఉండేలా..
హైడ్రేటెడ్‌గా ఉండేలా కేర్ తీసుకోవాలి. మనతోపాటు ప్రోటీన్ బార్‌లు కూడా తీసుకెళ్లాలి. అలాగే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా కేర్ తీసుకోండి. జిమ్‌కి వెళ్లడం, స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా, బల శిక్షణకు సంబంధించిన వర్కౌట్‌లు వంటివి ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం అని సూచించారు.
పెయిన్ కిల్లర్స్‌కి దూరం..
ఇప్పటికే ఏదైనా గాయం లేదా కాలి సమస్య ఉంటే..నొప్పి నివారణ మంందులు తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు. అన్ని నొప్పి నివారణ మందులు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. సుమారు 4 నుంచి 5 గంటలు గర్భా నృత్యం చేస్తున్నప్పుడూ డీ హైడ్రేషన్‌కి గురవ్వతారు ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు.
శరీరం మాట వినండి..
గర్భా సమయంలో శరీరంలో ఏ భాగం నుంచి అయినా నొప్పి వస్తే..ఆగిపోండి. కాస్త ఇబ్బందికరంగా ఉన్నా..డ్యాన్స్ చేసే సాహసం చెయ్యొద్దు అని సూచిస్తున్నారు. తక్షణమే సమీప వైద్యలును సంప్రదిస్తే..సురక్షితంగా ఉంటారని అన్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!)