breaking news
Ramlila Show
-
ప్రపంచంలోనే అతి పురాతనమైన రాంలీలా ఇది..! ఎక్కడంటే..
దసరా వేడుకల్లో భాగంగా ఉత్తరభారతదేశం ఢిల్లీ తప్పనిసరిగా రాంలీలా ప్రదర్శన జరుగుతుంది. మన సంస్కృతికి అద్దం పట్టే ఈ ఇతిహాసం చెడుపై మంచి ఎప్పటికైనా గెలవాల్సిందే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే కాదు సత్ప్రవర్తనతో మెలిగేందుకు దోహదపడుతోంది. అలాంటి రాంలీల ప్రదర్శన ఎప్పుడు మొదలైంది..? ఎవరు ప్రారంభించారు..? అంటే..ఈ రాంలీలా 485 ఏళ్ల క్రితమే కాళీలో ప్రారంభమైందట. వారణాసిలో జరిగే చిత్రకూట్ రాంలీలా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రాంలీలా అట. 16వ శతాబ్దంలో 1540 ఆ సమయంలో జరిగిందట. ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతోందట. 16వ శతాబ్దంలో తులసీదాస్ రామచరితమానస్‌ని అవధి భాషలో రాశారు. ఆయన వారణాసిలో కూర్చొని రామ ధ్యానం, ఆయన కథ వినిపిస్తుండేవాడట. తనకు రామదర్శనం ఎప్పుడవుతుందని కుతుహలంగా ఎదురుచూసేవాడట. ఒకనొక సందర్భంలో అస్సీఘాట్‌లో తులసీదాస్ రామకథ చెబుతుండగా రాముడు, సీత, లక్ష్మణ సమేతంగా వెళ్తున్నట్లు దర్శనం పొందుతాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన శిష్యుడు మేఘ భగవత్ ఈ రాంలీలా ప్రదర్శన సంప్రదాయాన్ని ప్రారంభించాడు. జనులంతా తులసీదాసు మాదిరిగా రాముడి అనుగ్రహానికి పాత్రులు కావాలనే ఉద్ధేవ్యంతో భగవత్ దీన్ని ప్రారంభించాట. వాస్తవానికి మేఘ భగవత్ రాంలీలా ప్రదర్శన వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందింపబడినప్పటికీ.. రాంలీలాని సంస్కృతంలోనే ప్రదర్శిస్తారట. అందువల్లే తులసీదాస్ రాసిన రామచరిత మానస్ ప్రసిద్ధికెక్కిందని చరిత్రకారులు చెబుతున్నారు.ఎన్నో విశేషాలు..ఇక్కడ రాంలీలా సుమారు 22 రోజులపాటు కొనసాగుతుందట. ముకుట్ పూజతో ప్రారంభమవుతుందట. రాముడు, లక్ష్మణుడు, సీత, ధరించే (ముకుట్)కిరీటాలకి పూజ చేయడంఓత ప్రారంభమవుతుంది. అంతేగాదు ఆ కిరీటాలు శతాబ్దాల నాటివని చెబుతుంటారు. అక్కడ ఈ వేకుడ కోసం చాలా పెద్ద ఆచారాన్ని నిర్వహిస్తారు అక్కడ. ఆ కిరీటాలను అలా పూజ చేసి పవిత్రంగా మార్చడంతో వాటిని ధరించిన మానవులు దేవతా స్వరూపులుగా కనిపిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. మరో ఆసక్తికరమైన ఘట్టం ఏంటంటే..నక్కటైయగా పిలిచే ఊరేగింపు. ఇది 12వ రోజు జరుగుతుంది. అప్పుడు శూర్పణఖ ఎపిసోడ్‌ని ప్రదర్శిస్తారు. పంచవటిలో రాముడి అందానికి మోహవశురాలైన ఘట్టం అత్యంత ముగ్ధమనోహరంగా జరుగుతుందట. అక్కడ కాశీ వీధులన్ని తిరుగుతూ నిర్వహిస్తారట ఆ సన్నివేశాన్ని. అంతేగాదు ఈ రాంలీలా నాటక ప్రదర్శన కోసం స్వచ్ఛందంగా దుకాణాలను బంద్ చేసి ప్రజలంతా గుమిగూడి మరి తిలికిస్తారట. అంత విశేషాలతో కూడుకున్నది అ చిత్రకూట్ రాంలీలా. (చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..) -
ఆ పేరు పెట్టుకుని రాంలీలాలో నటిస్తావా?
బదానా: ఉడీ ఉగ్రదాడిపై స్పందించని కారణంగా ఇండియాలోని పాకిస్థానీ నటులు దేశం విడిచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసిన శివసేన.. ఇప్పుడు స్వదేశీ నటులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ రాంలీలా నాటకంలో నటించడానికి వీలులేదని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ లోని బదానాలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారి దీపక్ కుమార్ మీడియాకు తెలిపారు. అసలేం జరిగిందంటే.. నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన స్వగ్రామం బదానా(ముజఫర్ నగర్ జిల్లాలో ఉందీఊరు)లో నవరాత్రుల సందర్భంగా ప్రదర్శించే రాంలీలా నటకంలో మారీచుడి పాత్ర ధరించాలనుకున్నాడు. బదానాలో రాంలీలా ప్రదర్శనకు గొప్ప పేరుంది. దాదాపు 100 ఏళ్ల నుంచి నవరాత్రుల సందర్భంగా అక్కడ ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. చిన్నప్పటి నుంచి దానిని చూస్తూ పెరిగిన నవాజుద్దీన్ ఏనాటికైనా నాటకంలో ఏదోఒక పాత్ర పోశించాలనుకున్నారు. పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన ఆయన.. నాటక నిర్వాహకులను కలిసి తనకో పాత్ర ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అలా గురువారం జరిగిన ప్రదర్శనలో ఆయనకు మారీచుడి వేషం దక్కింది. దీంతో స్టార్ నటుణ్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అయితే ప్రదర్శన ప్రారంభానికి రెండు గంటల ముందు నాటకంలో నవాజుద్దీన్ నటించడంలేదంటూ నిర్వాహకులు ప్రకటించారు. శివసేనకు చెందిన కొందరు కార్యకర్తలు రాంలీలాలో నటించకూడదని హెచ్చరించడమే ఇందుకు కారణమని తెలిసింది. 'నవాజుద్దీన్ సిద్దిఖీ అనే పేరు పెట్టుకుని రాంలీలాలో ఎలా నటిస్తావ్?'అని శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రత్యక్షసాక్షలు తెలిపారు. వ్యతిరేకత నేపథ్యంలో సొంత ఊరి నుంచి ముంబై వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నవాజుద్దీన్.. 'గ్రామంలో ఉద్రిక్తత తలెత్తడం నాకు ఇష్టం లేదు. అందుకే నటించకూడదని నిర్ణయించుకున్నా'అని మీడియాకు చెప్పారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ఉదంతంపై స్పందిస్తూ.. నటీనటులకు మత బేధాలు ఉండవని, టాలెంట్ మాత్రమే ఉంటుందని, ఆందోళనకారులు ఈ సంగతి గుర్తెరగాలని అన్నారు.