2025 మార్చి నాటికే పూర్తి కావాల్సిన భవనాలు
● చంద్రబాబు ప్రభుత్వానికి పట్టని ఏపీవీపీ ఆస్పత్రులు
● ఆస్పత్రుల ఆధునీకరణకు నిధులు మంజూరు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
● నాలుగు ఆస్పత్రులకు రూ.42.83 కోట్లు మంజూరు
● బిల్లులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్
● రూ.20.91 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన వైనం
గడువు
ముగిసింది..
బిల్లులు అప్‌లోడ్ చేయడానికి గడువు ముగిసింది. నాబార్డు వారు బిల్లులు అప్‌లోడ్ చేయడానికి గడువు పెంచాల్సి ఉంది. ప్రభుత్వం ఇతర నిధులు కేటాయించినా బిల్లులు అప్‌లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
– భారతి,ఈఈ,
ఏపీఎంఎస్‌ఐడీసీ
విజయనగరం ఫోర్ట్:
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్షరాలా అమలు చేసి చేతల్లో చూపించారు. నాడు–నేడు ద్వారా ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేసారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను తీర్చిదిద్దారు. వైద్య రంగంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జీరో వేకేన్సీ పాలసీ ద్వారా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేశారు. ఏళ్ల తరబడి అప్‌గ్రేడేషన్‌కు నోచుకోని సామాజిక ఆస్పత్రులను అప్‌గ్రేడేషన్ చేసింది. అంతేకాకుండా వాటికి అవసరమైన అదనపు భవనాలను కూడా మంజూరు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏరియా ఆస్పత్రులు, సామజిక ఆరోగ్య కేంద్రాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వైద్య విధాన్ పరిషత్ పరిధిలోని ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు నాలుగింటికి అదనపు భవనాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం రూ.కోట్లు నిధులను కేటాయించింది. గజపతినగరం సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా 30 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడేషన్ చేసింది. ఇందుకోసం అదనపు భవనాల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేసింది. ఎస్.కోట సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మార్చి 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడేషన్ చేశారు. అదనపు భవనాల నిర్మాణం కోసం రూ.12.60 కోట్లు మంజూరు చేశారు. బాడంగి సీహెచ్‌సీని 30 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడేషన్ చేశారు. ఇందుకోసం రూ. 8.81 కోట్లు మంజూరు చేశారు. నెల్లిమర్ల సీహెచ్‌సీ 30 పడకల ఆస్పత్రి ఆధునీకరణ, భవనాల నిర్మాణం కోసం రూ.4.42 కోట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది.
చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏపీవీపీ ఆస్పత్రుల భవనాల నిర్మాణం, ఆధునీకరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా అలసత్వం జాప్యం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు ఆస్పత్రులకు సంబంధించి రూ.20.91 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది.
ఏపీవీపీకి చెందిన నాలుగు ఆస్పత్రులకు
భవనాలు మంజూరు
రూ.20.91 కోట్ల బిల్లులు పెండింగ్
2020లో అప్పటి వైఎస్సార్‌సీసీ ప్రభుత్వం ఆస్పత్రులను అప్‌గ్రేడేషన్ చేయడంతో పాటు అప్‌గ్రేడేషన్‌కు తగ్గట్టుగా వసతుల కల్పన, అదనపు భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. భవనాల నిర్మాణం, ఆధునీకరణ పనులను 2025 మార్చి నెలఖారు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. గడువు దాటి 10 నెలలు అయినా ఇంకా భవనాలు నిర్మాణం పూర్తి కాలేదు.
2025 మార్చి నాటికే పూర్తి కావాల్సిన భవనాలు
2025 మార్చి నాటికే పూర్తి కావాల్సిన భవనాలు


