పట్టుబట్టి పతకం పట్టాడు
శృంగవరపుకోట: స్వయంకృషి, పట్టుదలతో సాధన చేశాడు. ఫలితంగా పసిడి పతకం సాధించాడు. ఎస్.కోట పట్టణానికి చెందిన కోన రమణ జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పసిడి పతకం సాధించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దల్లీరాజ్‌హరా జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 2వరకూ జరిగిన సీఎం ట్రోఫీ, ఓపెన్ నేషనల్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో 75కిలోల విబాగంలో రమణ 3వ స్థానం సాధించి పసిడి పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను కై వసం చేసుకున్నారు. 13రాష్ట్రాలకు చెందిన సుమారు 350మంది పోటీదారులు పాల్గొన్న జాతీయస్థాయి పోటీల్లో తొలిసారి పసిడి పతకం సాధించడం ఆనందంగా ఉందని బాడీబిల్డర్ కోన రమణ చెప్పాడు. అలాగే మార్చి నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలిపాడు.
విజయనగరం క్రైమ్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు అత్యంత కీలమని ఎస్పీ దామోదర్ అన్నారు. ప్రజల భద్రతలో అవి ముఖ్య భూమిక అని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్ స్థలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలు, చైన్ స్నాచింగ్స్ వంటి ఘటనలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు. ఒకవేళ నేరం జరిగితే ఆ తీరును సీసీ ఫుటేజ్ ద్వారా కేసుల దర్యాప్తు చేపట్టడం సులభతరమ వుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో సీసీ ఫుటేజ్ లే సాక్ష్యాల సేకరణకు, ఉపయక్తంగా ఉంటున్నాయన్నారు. పాఠశాలలు, ఆసుపత్రుల్లోను, ముఖ్య కూడళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల భద్రతకు భరోసా లభిస్తుందని అభిప్రాయ పడ్డారు. స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిదరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులును ఎస్పీ ఆదేశించారు.


