మాజీ సైనికోద్యోగులకు న్యాయ అవగాహన సదస్సు
విజయనగరంలీగల్: జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణ ప్రసాద్ విజయనగరంలో ఉన్న జిల్లా సైనిక సంక్షేమ శాఖ లో మాజీ సైనికుకోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ సైనికోద్యోగులకు అలాగే సైనికోద్యోగుల కోసం ప్రత్యేకంగా న్యాయ సేవల శిబిరాన్ని జిల్లా సైనిక సంక్షేమ బోర్డులో ఏర్పాటు చేశారని, ఈ న్యాయ సేవల ముఖ్య ఉద్దేశం సైనికులకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు న్యాయ సేవను అందించడమేనని తెలియజేశారు. ఈ సేవల శిబిరంలో ఒక ప్యానల్ లాయర్‌ను, ఒక పారా లీగల్ వలంటీర్‌ను నియమించామని ఎవరికై నా న్యాయ సలహాలు సేవలు అవసరమైతే ప్యానల్ లాయర్‌ను సంప్రదించవచ్చని తెలియజేశారు, వారికి ఏ విధమైన న్యాయ అవసరాలు ఉన్నా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన మాజీ సైనికోద్యోగులతో ముఖాముఖి చర్చించి వారికి తగిన న్యాయ సలహాలను సూచనలు అందజేశారు. కార్యక్రమంలో పానల్ లాయర్ పి.ధనుంజయ్ రావు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాద్ మాజీ సైనికోద్యోగుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


