కరుణించు మేరీమాత..! | - | Sakshi
Sakshi News home page

కరుణించు మేరీమాత..!

Jan 30 2026 7:04 AM | Updated on Jan 30 2026 7:04 AM

కరుణి

కరుణించు మేరీమాత..!

కరుణించు మేరీమాత..!

వీరఘట్టం: వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద గల మరియగిరి కొండపై వెలసిన శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియమ్మ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఏటా జనవరి 30న మరియగిరి యాత్ర ఆనవాయితీగా జరుగుతోంది. కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. కొబ్బరికాయలు కొట్టి, తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున గతంలో కంటే వైభవంగా మహోత్సవాన్ని జరిపేందుకు మరియగిరి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. భక్తులు మరియమ్మను దర్శించుకునేందుకు కొండపైన క్యూలు ఏర్పాటు చేశారు. కొండ దిగువన శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి రాయిరాల విజయకుమార్‌ ఆధ్వర్యంలో జరగనున్న దివ్యపూజకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ప్రార్థనా మందిరాన్ని సిద్ధం చేశారు. యాత్ర ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

33 ఏళ్లుగా శ్రీకాకుళం మేత్రాసనం ఆధ్వర్యంలో..

పూర్వకాలం నుంచి మరియగిరి యాత్ర ఇక్కడ జరిగేది. అయితే గడిచిన 33 ఏళ్ల నుంచి శ్రీకాకుళం మేత్రాసనం ఆధ్వర్యంలో మరియగిరి యాత్ర జరుగుతోంది. ఈ ఏడాది మరియగిరి యాత్రను అత్యంత వైభవంగా నిర్వహించడానకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన మరియగిరి ముఖద్వారాన్ని బిషప్‌ శుక్రవారం ఉదయం ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఇప్పటికే పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు చర్చిల ఫాదర్‌లు, మఠకన్యలు హాజరై ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

120 మంది పోలీస్‌ సిబ్బంది..

మరియగిరి యాత్రకు ఏడుగురు ఎస్సైలు, ఒక సీఐతో పాటు 120 మంది పోలీస్‌ సిబ్బందిని నియమిస్తున్నట్లు పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పాలకొండ సీఐ ఎ.ప్రసాదరావు, వీరఘట్టం ఎస్సై ఎస్‌.షణ్ముఖరావుతో కలిసి మరియగిరి ప్రాంగణాన్ని పరిశీలించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు బృందాలను నియమించారు. వాహనదారులు, ముఖ్యంగా ఆటోలు నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాలు చేయాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పార్కింగ్‌ స్ధలాల్లో మాత్రమే వాహనాలను నిలుపుదల చేయాలని కోరారు.

ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

మరియగిరి యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలి రానున్నారు. వారి కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం ఆర్టీసీ డిపోల నుంచి ప్రతి 10 నిమిషాలకు మరియగిరి స్పెషల్‌ బస్సులు నడపనున్నట్లు ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. సుమారు 50 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరియగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్‌ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

నేడు మరియగిరి యాత్ర

ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి

120 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు

పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

గట్టి బందోబస్తు ఏర్పాటు చేయండి: సబ్‌ కలెక్టర్‌

వీరఘట్టం: మరియగిరి వద్ద శుక్రవారం జరగనున్న మేరీమాత ఉత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన యాత్ర ప్రాంగణాన్ని పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఎస్సై షణ్ముఖరావుతో మాట్లాడారు.యాత్రకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మరియగిరి ఫాదర్స్‌కు సూచించారు. భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు.

మరియమ్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

మేరీమాత దర్శనం కోసం కొండపైకి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశాం. కొండ దిగువన, కొండపైన టెంకాయలు కొట్టేందుకు, కొవ్వొత్తులు వెలిగించి ఆరాధన చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి మఠకన్యలు, ఫాదర్లు మరియగిరి వద్దకు చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా మేరీమాతను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాం. భక్తులు కూడా సహకరించాలి.

ఫాదర్‌ విజయ్‌రెడ్డి, మరియగిరి

కరుణించు మేరీమాత..!1
1/4

కరుణించు మేరీమాత..!

కరుణించు మేరీమాత..!2
2/4

కరుణించు మేరీమాత..!

కరుణించు మేరీమాత..!3
3/4

కరుణించు మేరీమాత..!

కరుణించు మేరీమాత..!4
4/4

కరుణించు మేరీమాత..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement