ఊరేగింపుగా పెళ్లికి పయనం... | - | Sakshi
Sakshi News home page

ఊరేగింపుగా పెళ్లికి పయనం...

Jan 30 2026 6:40 AM | Updated on Jan 30 2026 5:06 PM

Seva for Lord

స్వామివారి మూడు వాహనాల సేవ

సీతారామస్వామివారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలతో అర్చకులు సుందరంగా అలంకరించారు. వివిధ రకాల స్వర్ణాభరణాలతో ముస్తాబుచేసి రాత్రి 7 గంటలకు హంస, అశ్వ, గరుడు వాహనాలపై రామతీర్థం పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి మూడు వాహనాల సేవను జరిపించారు. 

ఈ ఊరేగింపులా భాగంగా సీతమ్మ తల్లి వాహనం, శ్రీరాముడి వాహనాలు ఎదురుపడినప్పుడు అర్చకులు వేద మంత్రాలతో తిరుక్కల్యాణ విశిష్టతను భక్త జనులకు చాటి చెప్పారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపానికి తీసుకువచ్చి స్వామివారి వివాహమహోత్సవాన్ని ప్రారంభించారు. ఆచారంగా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామానికి చెందిన ఏకుల కుటుంబీకులు తెచ్చిన పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement